నగరంలో పెరుగుతున్న నీటి కొరత.. భవిష్యత్తులో తప్పని ఇబ్బందులు!
హైదరాబాద్‌లో మంచినీటి కొరత తీవ్రరూపం దాల్చుతోంది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ నినో ప్రభావం, వర్షపాతం తగ్గడం సమస్యను మరింత పెంచుతున్నాయి. రోజుకు 6 వేల ట్యాంకర్ల బుకింగ్స్ వస్తున్న నేపథ్యంలో, జలమండలి అధికారులు నిర్మాణ రంగంలో ఎస్టీపీ నీటి వాడకాన్ని సూచించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నగరంలో మంచినీటి కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు సమృద్ధిగా కురవకపోవటం, ఉష్ణోగ్రతలు పెరగటం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుతం నగరంలో రోజుకు 6,000కు పైగా నీళ్ల ట్యాంకర్ల బుకింగ్స్ వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో, భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోతున్న దృష్ట్యా వాటర్ బోర్డ్ అధికారులు కీలక సూచనలు చేశారు. నిర్మాణ రంగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భూగర్భజలాలను వాడకూడదని, కేవలం ఎస్టీపీ నీటిని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలం వరకు నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతిఒక్కరు నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు ద్వారా దాదాపు మూడు లక్షల కనెక్షన్లకు తాగునీరు అందిస్తున్నారు. వచ్చే జనవరి నుంచి గోదావరి నీటి డ్రా ద్వారా అదనంగా మరో 50 మిలియన్ గ్యాలన్ల నీరు అందుబాటులోకి రానుంది. నగర వ్యాప్తంగా 95 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల ద్వారా వేగంగా నీటి ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు గతేడాది 14,000 వాటర్ రీఛార్జ్ గుంతలపై దృష్టి పెట్టగా, ఈ ఏడాది ఆ సంఖ్యను 22,000కు పెంచి రీఛార్జ్ పనులు వేగవంతం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉష్ణోగ్రతల మార్పుల వల్ల సాధారణ వర్షపాతం తగ్గి, ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇది రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉన్నందున భూగర్భ జలాలు ఇంకా క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి బొట్టు నీరు విలువైందే. ఇళ్లు, అపార్ట్మెంట్లలో నీటిని వృధా చేయకుండా నగరవాసులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే ఈ వేసవి నీటి గండం నుంచి బయటపడగలం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lucky Draw: ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
