సంక్రాంతిలోపు వర్షాలు కురిస్తే ఒకే.. లేకుంటే.. హైదరాబాద్‌లో తప్పని వాటర్ ఎమర్జెన్సీ

Updated on: Oct 31, 2026 | 6:18 PM

హైదరాబాద్‌లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో తాగునీటి సరఫరాపై ఆందోళన పెరుగుతోంది. వర్షాలు కురిసి పరిస్థితి మెరుగుపడకపోతే మూడు రోజులకోసారి నల్లా నీళ్లు సరఫరా చేసే ప్రత్యామ్నాయంపై జలమండలి ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీన్ని చివరి అవకాశంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్ల డిమాండ్‌ పెరుగుతుండటంతో కొత్త బోర్లపై ఆంక్షలు, శుద్ధి చేసిన నీటి వినియోగంపైనా అధికారులు దృష్టి పెట్టారు.

హైదరాబాద్‌లో వాటర్‌ ఎమర్జెన్సీ తప్పదా?.. నీటి కష్టాలు ఇప్పుడే మొదలవుతున్నాయా?.. రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటి నిల్వలు హైదరాబాద్‌ జలమండలికి టెన్షన్‌ పుట్టిస్తున్నాయా?.. సంక్రాంతిలోపు వర్షాలు కురిసి పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సరఫరాపై ఆంక్షలు విధించడం ఖాయమా?.. లాస్ట్‌ అప్షన్‌గా.. నల్లా నీళ్లు మూడు రోజులకోసారి సప్లయ్‌ చేసేందుకు జలమండలి ప్లాన్‌ చేస్తోందా?గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి కష్టాలపై ఆందోళన మొదలైంది. ఒకవైపు రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతుండగా.. మరోవైపు నగరంలో నీటి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. వర్షాలు సకాలంలో కురవకపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దీంతో.. రానున్న రోజుల్లో నగరానికి తాగునీటి సరఫరా ఎలా ఉండబోతోందన్న పిక్చర్‌ కళ్ల ముందు కనిపిస్తోంది. అయితే.. సంక్రాంతిలోపు వర్షాలు కురిసి రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగితే ఒకే.. ఇబ్బందులు కాస్తా తగ్గుతాయి. లేదంటే హైదరాబాద్‌లో నీటి వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి రావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ.. హైదరాబాద్‌ జలమండలికి సవాలుగా మారుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని మెజార్టీ ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ గణనీయంగా పడిపోవడం, నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం మరింత భయపెడుతోంది. దీంతో.. నల్లా నీటి సప్లై జలమండలికి భారంగా మారుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వాటర్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితి నెలకొంటోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో స్వయంగా జలమండలి అధికారులు ఇలాంటి కామెంట్స్‌ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో తాగునీటి గండం పొంచి ఉండటంతో సంచలన నిర్ణయం దిశగా జలమండలి అడుగులు వేస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇకపై మూడు రోజులకోసారి నల్లా నీళ్లు ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నగరానికి తాగునీటిని అందించే సింగూరు, మంజీర రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజీకి చేరుకోవడంతో అక్కడి నుంచి తీసుకోవడం అసాధ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టింది. హైదరాబాద్‌లో నల్లా ద్వారా రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తుండగా.. నీటి కొరత కారణంగా ఇకపై మూడు రోజులకు ఒకసారి సప్లై చేసేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. వాస్తవానికి.. సికింద్రాబాద్ కంటోన్మెంట్, సిటీ శివారు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. దీంతో.. జలమండలి పరిధిలోని అన్ని ప్రాంతాలకూ ఇదే విధానాన్ని అమలు చేస్తే నీటి కొరత భారాన్ని కొంత తగ్గించుకోవచ్చని భావిస్తోంది. అయితే.. మూడు రోజులకు ఒకసారి వాటర్‌ సప్లయ్‌ అనే ప్లానింగ్‌ను చివరి ఆప్షన్‌గా భావిస్తోంది జలమండలి. ఈ అంశంపై అధికారులు నుంచి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. వేసవి తరహాలోనే ఇప్పుడు కూడా ప్రతీరోజు యావరేజ్‌గా ఏడున్నర వేలకు పైగా ట్యాంకర్ల బుకింగ్స్ ఉంటున్నాయి. ప్రైవేట్ ట్యాంకర్ల సంఖ్య దీనికి నాలుగైదు రెట్లు ఎక్కువే ఉండొచ్చని జలమండలి భావిస్తోంది. అందుకే.. సిటీలోని పలు ప్రాంతాల్లో కొత్త బోర్లపై నిషేధం విధించింది. ప్రత్యేక సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. దీంతో పాటు.. గ్రౌండ్ వాటర్ లెవెల్స్‌పై ఆడిట్ నిర్వహించాలనే ఆలోచన చేస్తుంది. మరోవైపు.. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా జలమండలి చర్యలు తీసుకుంటోంది. వచ్చే నెల 1 నుంచి గ్రీన్ వాటర్‌ ట్యాంకర్ల పేరుతో పరిశ్రమలు, భవన నిర్మాణాలు, గార్డెనింగ్, సాధారణ అవసరాలకు నీటిని సప్లై చేసేందుకు ప్లాన్ చేస్తుంది. మొత్తంగా.. రిజర్వాయర్లలో తగ్గుతున్న నిల్వలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌తో జలమండలి అలర్ట్ అవుతోంది. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు.. ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి సారిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమలలోని శతాబ్దాల చరిత్రకు డిజిటల్‌ రక్షణ

కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం…

మీరు కొనేవన్నీ సన్నబియ్యమేనా..

తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. KBR తరహాలో మరో వన్‌-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్

Loading...
Unable to load recommendations.
Follow Us