హైటెక్ సిటీ స్టేషన్‌లో 10 రైళ్లకు హాల్ట్! ఇక ఆఫీస్ నుంచి నేరుగా మీ సొంతూరికి

Updated on: Oct 03, 2026 | 7:08 PM

హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగులు, నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సౌకర్యం కల్పించింది. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని నవంబర్‌ 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌ ఇచ్చింది. ఇప్పటికే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నుంచి టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు అదనపు ఛార్జీ లేకుండా హైటెక్‌ సిటీని బోర్డింగ్‌ పాయింట్‌గా మార్చుకునే అవకాశం ఉంది.

పండుగల సీజన్ ప్రారంభానికి ముందు.. హైదరాబాద్ ప్రజలకు, అలాగే ఐటీ ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే అద్దిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. ముఖ్యంగా.. దీపావళి, సంక్రాంతి పండుగల టైమ్‌లో సొంతూళ్లకు వెళ్లాలన్నా, తిరిగి రావలన్నా సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లకు వెళ్లి ఆ ట్రాఫిక్‌లో నరకం చూడాల్సిన పనిలేదు.. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రయాణికుల కోసం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఏకంగా 10 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్ ఇస్తూ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.. అంతేకాదు… ఇప్పటికే సికింద్రాబాద్ లేదా నాంపల్లి నుంచి టికెట్ బుక్ చేసుకున్నవాళ్లు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ‘బోర్డింగ్ పాయింట్’ మార్చుకోవచ్చు.. అసలు ఏయే రైళ్లు హైటెక్ సిటీలో ఆగబోతున్నాయి? ఏ టైమ్‌కి వస్తాయి? ఈ ఫెసిలిటీ ఎప్పటివరకు ఉంటుంది? ఈ వీడియోలో క్లియర్‌గా చూసేద్దాం.. “పండుగల సీజన్ వచ్చిందంటే చాలు… సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ బెల్ట్ నుంచి అక్కడికి వెళ్లాలంటేనే గంటల కొద్దీ ట్రాఫిక్‌లో నలిగిపోవాలి. ఈ ప్రయాణికుల భారాన్ని తగ్గించడానికే దక్షిణ మధ్య రైల్వే ఈ మాస్టర్ ప్లాన్ వేసింది! ఈ తాత్కాలిక హాల్ట్‌లు నవంబర్ 1, 2026 నుండి జనవరి 31, 2027 వరకు అమల్లో ఉంటాయి. ఉచిత బోర్డింగ్ పాయింట్ మార్పు.. మీ టికెట్ సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ స్టేషన్ నుండి ఉన్నప్పటికీ… మీరు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండానే మీ బోర్డింగ్ పాయింట్‌ను హైటెక్ సిటీకి సులువుగా మార్చుకోవచ్చు.. “సరే! అసలు ఏయే రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్‌లో ఆగుతాయో, వాటి టైమింగ్స్ ఏంటో ఒకసారి నోట్ చేసుకోండి:

సికింద్రాబాద్ – రాజ్‌కోట్ రైలు నెంబర్ 22718.. మధ్యాహ్నం 3.30 గంటలకు.
రాజ్‌కోట్ – సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ 22717.. ఉదయం 6.19 గంటలకు.

సికింద్రాబాద్ – పోరుబందర్ రైలు నెంబర్ 20967 మధ్యాహ్నం 3.30 గంటలకు.
పోరుబందర్ – సికింద్రాబాద్ రైలు నెంబర్ 20968 ఉదయం 6.19 గంటలకు.

తిరుపతి – సికింద్రాబాద్ రైలు నెంబర్ 12731 ఉదయం 6.08 గంటలకు.
సికింద్రాబాద్ – తిరుపతి ట్రైన్ నెంబర్ 12732 తెల్లవారుజామున 4.35 గంటలకు.

హైదరాబాద్ – సీఎస్టీ ముంబై ట్రైన్ నెంబర్ 12702 రాత్రి 3.17 గంటలకు.
సీఎస్టీ ముంబై – హైదరాబాద్ రైలు నెంబర్ 12701 ఉదయం 11.07 గంటలకు.

పుణె – హైదరాబాద్ రైలు నెంబర్ 12025 మధ్యాహ్నం 1.33 గంటలకు.
హైదరాబాద్ – పుణె ట్రైన్ నెంబర్ 12026 మధ్యాహ్నం 3.00 గంటలకు.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఆగుతాయి..

అయితే.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక.. గుజరాత్ వైపు ప్రయాణించే వారికి ఇది నిజంగా వరమనే చెప్పాలి.. అంతేకాకుండా.. ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను ఉపయోగించుకునే వారు.. డైరెక్టుగా ఆఫీసుల నుంచే ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.. “సో గాయిస్… పండుగలకు ఇంటికి వెళ్లే మీ ఫ్రెండ్స్, రూమ్‌మేట్స్, వాట్సాప్ ఐటీ గ్రూపులలో ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేసి అలర్ట్ చేయండి! లాస్ట్ మినిట్ ట్రాఫిక్ టెన్షన్ నుంచి వాళ్లను కాపాడండి..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ba Ba Black Sheep: పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు చేస్తుంది

Published on: Oct 03, 2026 06:16 PM
Loading...
Unable to load recommendations.
Follow Us