విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్.. రైల్వే బైపాస్ లైన్‌ నిర్మాణం

Updated on: Sep 30, 2026 | 4:44 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం చిన్న బొడ్డు వెంకటాయపాలెంలో ఓ ఇంటి మిద్దెపైకి ప్రతిరోజూ వందలాది రామచిలుకలు వస్తున్నాయి. ఆటో డ్రైవర్‌ వాడ్రేవు బాలకృష్ణ పక్షి ప్రేమతో తొలుత ధాన్యం పెట్టగా ఒకట్రెండు చిలుకలు రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు ఐదు కేజీల ధాన్యంతో పాటు జామ, యాపిల్‌ వంటి పండ్లను కూడా మూడు పూటలా అందిస్తున్నారు. పరిమిత ఆదాయంతోనే పక్షులను పోషిస్తున్న బాలకృష్ణ కుటుంబాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

విజయవాడ రైల్వే జంక్షన్‌పై పెరుగుతున్న రైళ్ల రద్దీకి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ కీలక అడుగులు వేస్తోంది. బెజవాడ రైల్వే డివిజన్ కేంద్రంగా రైల్వే బైపాస్ లైన్‌ రూపుదిద్దుకుంటోంది. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ ప్రధాన జంక్షన్‌లోకి రాకుండానే గమ్యస్థానాలకు వెళ్లేలా రైల్వే బైపాస్ నిర్మాణం జరుగుతుంది. అసలు రైల్వే బైపాస్ అంటే ఏంటి? విజయవాడ రైల్వే జంక్షన్. కాజీపేట, సికింద్రాబాద్‌, విశాఖపట్నం, చెన్నై నుంచి రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. రైల్వే ట్రాకులపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో రైళ్లు గమ్యస్థానాలకు చేరే క్రమంలో అధిక సమయం పడుతుంది. ఈ క్రమంలో ట్రాకులపై ఏర్పడుతున్న రద్దీని తగ్గించేందుకు రైల్వే స్టేషన్లు, రైల్వే డివిజన్లు, రైల్వే జంక్షన్లపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి రైల్వే బైపాస్‌లను ప్రతిష్టాత్మకంగా రైల్వే శాఖ నిర్మిస్తుంది. అందులో భాగంగానే రాయనపాడు,ముస్తాబాద మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని రైల్వే బైపాస్‌గా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 22 కిలోమీటర్ల మేర బైపాస్ లైన్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును 500 కోట్లతో నిర్మిస్తున్నారు. రైల్వే బైపాస్ నిర్మాణంలో భాగంగా రాయనపాడు నుంచి నార్త్‌ ఈస్ట్‌ క్యాబిన్‌, నార్త్‌ ఈస్ట్‌ క్యాబిన్ నుంచి గుణదల, గుణదల నుంచి ముస్తాబాద వరకు మూడు విభాగాలుగా రైల్వే బైపాస్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి రాగా మిగిలిన మొత్తం పూర్తయితే రాయనపాడు నుంచి ముస్తాబాద వరకు విజయవాడ ప్రధాన జంక్షన్‌ను పక్కకు పెట్టి రైళ్లను మళ్లించే అవకాశం ఏర్పడుతుంది. రైళ్ల రాకపోకల సమయంలో ఒక రైల్వే లైన్‌కు అడ్డంగా మరో రైల్వే లైన్‌ వస్తున్న చోట లెవల్ క్రాసింగ్‌కు బదులుగా ఒక పట్టాలను మరో పట్టాలపై నుంచి తీసుకెళ్లేలా రైల్ ఓవర్ రైల్ వంతెనలను రైల్వే అధికారులు నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు RORలు కొన్ని మాత్రమే నిర్మించారని, రైల్వే ఇంజనీరింగ్‌లోనే ఇదొక కీలక ఆవిష్కరణగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ROR నిర్మాణంలో భాగంగా గుణదల–ముస్తాబాద మధ్య నిర్మిస్తున్న రైల్ ఓవర్ రైల్‌లో భారీ ఓపెన్ వెబ్ గిర్డర్‌ నిర్మాణం పూర్తయింది. విజయవాడ న్యూ వెస్ట్‌ బ్లాక్‌ హట్‌ రైల్వే క్యాబిన్‌ సమీపంలో మరో ROR పనులు జరుగుతున్నాయి. రైల్వే బైపాస్ ప్రధానంగా గూడ్స్ రైళ్లకు కీలకంగా మారనుంది. కాజీపేట, సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే సరుకు రైళ్లను విజయవాడ ప్రధాన స్టేషన్‌లోకి తీసుకు రాకుండానే దారి మళ్లించే అవకాశం ఉంటుంది. దీనివల్ల విజయవాడ జంక్షన్‌లో ట్రాక్‌లపై ఒత్తిడి తగ్గి ప్రయాణికుల రైళ్లకు మరిన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనీ రైల్వే అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము.. అసలేం జరిగింది?

అయ్యో.. గుడ్లు అనుకొని గోల్ఫ్‌ బాల్స్‌ మింగేసిన పాము.. ఆ తర్వాత

Loading...
Unable to load recommendations.
Follow Us