AP News: ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూడగా దెబ్బకు ప్యాంట్ తడిసింది!

కాలువలో చేపల కోసం వేసిన వలకు పెద్ద చేప చిక్కిందనుకున్నారు. ఎంత గుంజినా బయటకు రాకపోవడంతో చేపలు భారీగానే పడ్డాయి అనుకొని పొంగిపోయారు. తీరా బయటకు తీసిన తర్వాత జాలర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వలలో చిక్కింది చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

AP News: ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూడగా దెబ్బకు ప్యాంట్ తడిసింది!

|

Updated on: Mar 28, 2024 | 4:10 PM

కాలువలో చేపల కోసం వేసిన వలకు పెద్ద చేప చిక్కిందనుకున్నారు. ఎంత గుంజినా బయటకు రాకపోవడంతో చేపలు భారీగానే పడ్డాయి అనుకొని పొంగిపోయారు. తీరా బయటకు తీసిన తర్వాత జాలర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వలలో చిక్కింది చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ పరిసర గ్రామాల ప్రజలు నిత్యం చేపలు వేటాడుతూ జీవనం సాగిస్తుంటారు. రోజూలాగే గురువారం కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. గుండ్లకమ్మ డ్యాంలో వల వేశారు. చేపలు పట్టుకునేందుకు వలను వేసారు. కాసేపటికి వల బరువెక్కింది. దాన్ని లాగడం ప్రారంభించారు. అయితే వల చాలా బరువుగా అనిపించింది. ఎంతలాగినా రాకపోవడంతో చేపలు దండిగా పడ్డాయనుకున్నారు. ముగ్గురు నలుగురు కలిసి వలను లాగారు. మొత్తానికి వలను ఒడ్డుకు లాగారు. వలను విప్పి చూడగానే దెబ్బకు షాకయ్యారు మత్స్యకారులు. చేపలు పడాల్సిన వలలో భారీ మొసలి పడింది. దెబ్బకు కంగారుపడ్డ మత్స్కారులు వలను అక్కడే వదిలి దూరంగా పరుగు తీశారు. అనంతరం సంబంధిత డ్యాం అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మొసలిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. మొసలి నాగార్జునసాగర్‌ డ్యామ్‌నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

Follow us
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..

పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఆరు నెలల్లో 2604 కోట్లు హాంఫట్..!

మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. కూటమి నేతలు

కూరగాయలు, పండ్ల మీద ఉండే కెమికల్స్‌ని ఇలా తొలగించండి..

ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా..? టమాటాతో ఇలా చేస్తే మెరుపు

ఇట్స్ అఫీషియల్.. మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది

ఎన్నికలకు సమ్మర్ ఎఫెక్ట్.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ వినతి

రైలులో పదేళ్ల క్రితం లగేజీ దొంగతనం.. రూ.1.45 లక్షల జరిమానా

బచ్చలి కూర కంటే ఐరన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే!

రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..
రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని

విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!

అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..

అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..