Rain Alert: బీ అలర్ట్..! తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన.. ప్రకటించిన వాతావరణశాఖ.

|

Aug 19, 2023 | 8:07 PM

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఆగస్ట్ 17,18 తేదీల్లో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజ్ గిరి, యాదాద్రి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఆగస్ట్ 17,18 తేదీల్లో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజ్ గిరి, యాదాద్రి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాది రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు, వరదల కారణంగా 10 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. తాము కోలుకోవడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని వివరించారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లో చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. అక్కడి ప్రజలను కాపాడేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, బీఎస్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us on