Rain Effect: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.

|

Sep 12, 2024 | 3:35 PM

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే.. భారీ వర్షాలు, వరదలతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో తీవ్ర వాయుగుండం బలపడబోతోందని.. పూరీ- దిఘా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో.. వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది. ఈ నాలుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on