AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంకల్పం బలంగా ఉంటే అసాధ్యం ఏదీ లేదు..TATA ACE వాహనంతో తన వ్యాపారం మరింత ముందుకు..

సంకల్పం బలంగా ఉంటే అసాధ్యం ఏదీ లేదు..TATA ACE వాహనంతో తన వ్యాపారం మరింత ముందుకు..

Subhash Goud
|

Updated on: Aug 14, 2025 | 5:00 PM

Share

TATA ACE: అతను తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంధనం, సెఫ్టీ ఫీచర్స్‌ను దృష్టిలో ఉంచుకుని వాహనాలను ఎంచుకున్నాడు. తన వ్యాపార ప్రయాణాన్ని ఒకే ఒక్క ACEతో ప్రారంభించాడు. బజార్‌లో ఎప్పటి నుంచో TATA ACE ఉందని, జీరో మెయింటనెన్స్‌తో..

TATA ACE: సంకల్పం బలంగా అసాధ్యం ఏదీ లేదు. నవీ ముంబైలోని ఘన్సోలిలో సంతోష్ కాషిద్ రవాణా, లాజిస్టిక్స్‌ వ్యాపారానికి అలాంటి దృఢమైన సంకల్పంతో గొప్ప గుర్తింపును ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతని తండ్రి మరణించిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవాల్సిన బరువైన బాధ్యత కాషిద్‌ భుజాన పడింది. కానీ కాషిద్‌ ఆ సమయంలో బలహీనంగా మారలేదు. ఆ సమయంలో అతను రవాణా వ్యాపారానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను దగ్గరగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. గతంలో ఆయన ఆదాయం అంత పెద్ద ట్రక్కులపైనే ఆధారపడి ఉంది.

కానీ అతను తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంధనం, సెఫ్టీ ఫీచర్స్‌ను దృష్టిలో ఉంచుకుని వాహనాలను ఎంచుకున్నాడు. తన వ్యాపార ప్రయాణాన్ని ఒకే ఒక్క ACEతో ప్రారంభించాడు. బజార్‌లో ఎప్పటి నుంచో TATA ACE ఉందని, జీరో మెయింటనెన్స్‌తో బండి నడస్తుందని భావించాడు. ఇంకా అది చిన్న బండి కాబట్టి చిన్న చిన్న వీధుల్లో సులభంగా తిరగచ్చు.. మైలేజీ కూడా బాగుంటుందని భావించాడు. చిన్న వ్యాపారులకు టాటా ఏస్‌ మంచిది. అందుకే నేను నా బిజినెస్‌కి వాహనాన్ని తీసుకున్నానని చెబుతున్నారు కాషిద్‌.

కుటుంబ బాధ్యతను కొడుకు చేతుల్లోకి తీసుకోవడం నుండి అభివృద్ధి చెందుతున్న లాజిస్టిక్స్ వ్యవస్థాపకుడిగా మారిన సంతోష్ కాషిద్ ప్రయాణం దృఢ సంకల్పం. అలాగే తెలివైన నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతిబింబిస్తుంది. అతని వ్యాపార విస్తరణకు కేంద్రంగా టాటా ACE ఉంది. వృద్ధిని సాధ్యం చేసి స్థిరంగా మార్చిన నమ్మకమైన భాగస్వామి. తన తండ్రి మరణం తర్వాత తన కుటుంబాన్ని పోషించుకుంటానని, బాధ్యతల బరువును మోస్తూ, రవాణా, లాజిస్టిక్స్ రంగం లోపాలను అర్థం చేసుకోవడంలో అతను నిమగ్నమైపోయాడు. సంతోష్‌ కాశీద్‌ తన వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తన దృడ సంకల్పం ఆధారంగా అతను ఒక పెద్ద లాజిస్టిక్స్‌ వ్యాపారాన్ని నిర్మించాడు. Tata Aceతో వ్యాపారం కొత్త విజయాలను అందుకుంది.

Published on: Aug 14, 2025 03:54 PM