Train Fire Accident: న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.! అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.

|

Nov 16, 2023 | 3:33 PM

వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్‌ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్‌ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎస్ 1 బోగీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు మరో రెండు బోగీలకు వ్యాపించాయి. రైలు సారాయ్ భూపత్ స్టేషన్ మీదుగా వెళుతున్న సమయంలో ఎస్ 1 బోగీలోంచి పొగలు రావడం గమనించిన స్టేషన్ మాస్టర్ వెంటనే రైలును ఆపేశారు. ఆ తరువాత సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం, మంటలను ఆర్పాక రైలు గమ్యస్థానం వైపు బయలుదేరింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా, మంటలను గుర్తించిన వెంటనే తాము రైలు కిటికీల్లోంచి దూకి బయటపడ్డామని ఓ ప్రయాణికుడు తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.