ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
జీ5 ఓటీటీ రాబోయే నెలల్లో 60కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలను ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ కంటెంట్ అందుబాటులోకి రానుంది. తెలుగు విభాగంలో ‘వృషకర్మ’, ‘ఎన్‌బీకే111’, ‘శ్రీమతి’, ‘భూతం భయ్యం’, ‘అనంతకాలం’ వంటి ప్రాజెక్టులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ మధ్య ఓటీటీ సంస్థలు తమ ఓటీటీ ఛానెల్లోకి ఏ కంటెంట్ వస్తుందనే దానిపై ముందుగానే క్లారిటీ ఇస్తున్నాయి. తమ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అయ్యే ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్లను పోస్ట్ చేస్తున్నాయి. ఇదివరకే నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ మూవీస్ లిస్ట్ ప్రకటించగా.. ఇప్పుడు జీ5 కూడా తమ ప్లాట్ ఫాంలో ఏకంగా 60 వరకు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయని అఫీషియల్ గా అనౌన్స్ చేసిందిప్పుడు. అయితే ఒక్క తెలుగు మాత్రమే కాదు.. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో… రాబోయే రోజుల్లో… స్ట్రీమింగ్ కానున్న సీరిస్‌లు.. సినిమాల వివరాలను జీ5 అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇందులో తెలుగు విషయానికి వస్తే… నాగచైతన్య ‘వృషకర్మ’, బాలకృష్ణ 111వ సినిమా, అనిల్ రావిపూడి-వెంకటేశ్ – కళ్యాణ్ రామ్ కొత్త మూవీ, నివేదా థామస్ ‘శ్రీమతి’, భూతం భయ్యం … ఇవే కాక ఇంకొన్ని మూవీస్.. ఈ ప్లాట్ ఫాం పై షెడ్యూల్ ప్రకారం అందుబాటులోకి రానున్నాయి.ఇవే కాక శ్రీకాంత్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’, అనంతకాలం సిరీస్‌లు.. జగపతిబాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ టాక్ షో ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే అన్ని భాషలు కలిపి 21 సినిమాలు 27 సిరీస్‌లు… చెరో ఆరు యానిమేషన్, ఏఐ మూవీస్ జాబితాలో ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu: బిగ్ బాస్ షురూ.. ‘గంగూలీ’ రాకతో క్రేజ్ మరింత ఎత్తుకు..
Jabardasth: జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ.. ఇక పంచ్‌లతో రచ్చ రచ్చే!
Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్ డే కానుక
Balakrishna: బాలయ్య హెల్త్ అప్‌డేట్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
