బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్

Updated on: Jul 16, 2026 | 1:00 PM

యష్ టాక్సిక్ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుంది. కేజీఎఫ్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. IMDb మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. యష్ కొత్త గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపించనున్నారు. కియారా అద్వానీ, నయనతార వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించనుంది.

యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాక్సిక్ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుండి వస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. విడుదల ఆలస్యమైనప్పటికీ, సినిమాపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని తాజాగా అరుదైన రికార్డులే నిరూపిస్తున్నాయి.రిలీజ్‌కు ముందే ప్రముఖ IMDb సంస్థ ప్రకటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాలో టాక్సిక్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా లేడీస్ అండ్ లేడీస్ టీజర్, ఆ తర్వాత వచ్చిన తబాహీ సాంగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.కేజీఎఫ్ క్రేజ్‌ను కొనసాగిస్తూ, యష్ ఈ చిత్రంలో సరికొత్త గ్యాంగ్‌స్టర్ అవతారంలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ₹500 కోట్ల భారీ బడ్జెట్‌తో KVN ప్రొడక్షన్స్‌తో కలిసి యష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు

 

Published on: Jul 16, 2026 12:59 PM
Follow Us