అమ్మకానికి కన్యత్వం.. రూ. 18 కోట్లకు కొన్న స్టార్‌ హీరో

Updated on: Apr 11, 2025 | 4:46 PM

సమాజంలో కొందరుంటారు. నలుగురు ఒకలా ఆలోచిస్తే.. వాళ్లు మరోలా ఆలోచిస్తారు. వారు చేసే పని, చెప్పే మాటలు వింటే..‘ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోక తప్పుదు. తాజాగా 22 ఏళ్ల ఓ యువతి తీసుకున్న నిర్ణయం, ఆమె కోసం ఓ హీరో చేసిన ఖర్చు గురించి తెలిస్తే మీరు కూడా షాకవుతారు. డబ్బు కోసం ఓ యువతి ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది.

ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే వేలంలో వందలాది మంది ధనవంతులు పోటీపడగా.. చివరకు ఓ హాలీవుడ్‌ హీరో రూ.18 కోట్లకు ఆమె కన్యత్వాన్ని దక్కించుకున్నాడు. బ్రిటన్‌లోని మంచెస్టర్‌కు చెందిన 22 ఏళ్ల లారా.. ప్రముఖ ఎస్కార్ట్ ఏజెన్సీ సిండ్రెల్లా వెబ్‌ సైట్‌ ద్వారా తన కన్యత్వానికి వేలం నిర్వహించింది. ఈ విషయం తెలియడంతో ఎంతో మంది ఆమెను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు బిడ్లు వేశారు. చివరకు లాస్ ఏంజిల్స్‌ కు చెందిన హాలీవుడ్ హీరో ఆమె కన్యత్వాన్ని సుమారు 1.7 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. ఇది మన ఇండియన్‌ కరెన్సీలో రూ.18 కోట్లకు సమానం. కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టడంపై లారా స్పందిస్తూ ఈ విషయంలో తనకు ఎలాంటి ఆందోళన, బాధ లేదంది. చాలా మంది అమ్మాయిలు ఎలాంటి ప్రతిఫలం పొందకుండానే తమ కన్యత్వాన్ని కోల్పోతారు. కానీ తను మాత్రం తన లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం తన కన్యత్వాన్ని వేలం పాట వేయాలని భావించాననీ చెప్పుకొచ్చింది. వచ్చిన డబ్బుతో తాను ఆర్థికంగా నిలదొక్కకుంటాననీ ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చాడు..’ చిరు ఎమోషనల్ ట్వీట్