జెన్ జీకి హాలీవుడ్ ఫీవర్.. తెలుగు సినిమాలు ఎందుకు కనెక్ట్ కావడం లేదు?

Edited By:

Updated on: Jul 21, 2026 | 6:01 PM

హాలీవుడ్, కొరియన్ కంటెంట్‌కు అలవాటు పడిన జెన్ జీ ప్రేక్షకులను తెలుగు సినిమాలు ఆకట్టుకోవడంలో వెనుకబడుతున్నాయా అనే చర్చ మొదలైంది. ‘ది ఒడిస్సీ’ విడుదలకు ముందే టికెట్లు అమ్ముడవుతుండగా, మన సినిమాలు మాత్రం స్వల్పకాలంలోనే బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి. దీనికి కథల ఎంపిక, ప్రీ-ప్రొడక్షన్ లోపాలు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచి వంటి అంశాలే కారణమా అనే విశ్లేషణ ఆసక్తి రేపుతోంది.

హాలీవుడ్, కొరియన్ సిరీస్‌ల మాయలో పడిన మన జెన్ జీ ఆడియన్స్‌ను మెప్పించడంలో తెలుగు దర్శకులు వెనకబడుతున్నారా..? ‘ది ఒడిస్సీ’ లాంటి సినిమాలకు విడుదలకు 10 రోజుల ముందే టికెట్లు అమ్ముడైపోతుంటే.. మన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల ముచ్చటగానే ఎందుకు మిగిలిపోతున్నాయి..? ఇంటర్నేషనల్ సినిమాలకు క్యూలు కడుతున్న జెన్ జీ.. మన సినిమాలను పట్టించుకోవట్లేదా..? ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ది ఒడిస్సీ ప్రభంజనం నడుస్తుంది. థియేటర్లలో ఈ సినిమా ఫుట్ ఫాల్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. జెన్ జీ అంతా ఇంటర్నేషనల్ కంటెంట్‌పైనే ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సిరీస్‌ల క్వాలిటీకి అలవాటు పడిన ఈ తరం ప్రేక్షకులను మన రొటీన్ కథలు ఆకట్టుకోలేకపోతున్నాయి. స్పైడర్ మ్యాన్, అవేంజర్స్ లాంటి సినిమాలొచ్చినప్పుడు ఇండియాలో థియేటర్లు దద్దరిల్లిపోతుంటే.. మన సినిమాలు మాత్రం వీకెండ్ దాటడమే గగనంగా మారిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ ది ఒడిస్సీ. మన కథ కాదు, మన చరిత్ర కాదు.. కానీ రిలీజ్‌కు 10 రోజుల ముందే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.. ఎప్పుడో రాజమౌళి సినిమా వచ్చినపుడే మన దగ్గర ఈ మ్యాజిక్ చూస్తుంటాం..! 2000 కోట్లతో తెరకెక్కిన ది ఒడిస్సీని కేవలం 91 రోజుల్లోనే నోలెన్ పూర్తి చేసారంటే నమ్మడం సాధ్యమేనా..? స్క్రిప్ట్ దశలోనే ప్రతి సన్నివేశాన్ని పక్కాగా డిజైన్ చేసుకోవడం వల్లే క్వాలిటీతో పాటు ప్రేక్షకుల్లో అంత అద్భుతమైన క్రేజ్ సాధ్యమవుతోంది. హాలీవుడ్ మేకర్స్‌పై జెన్ జీ సాధించిన ఈ నమ్మకాన్ని.. మన మేకర్స్ సంపాదించడంలో ఎక్కడో వెనకబడుతున్నారనేది కాదనలేని నిజం. ప్రీ ప్రొడక్షన్ కంటే సెట్స్ మీదకు వెళ్లాక కథలు మార్చడం, ఏళ్ల తరబడి షూటింగ్స్ చేయడం వల్లే మన బడ్జెట్లు పెరిగిపోయి కంటెంట్ దెబ్బతింటోంది. కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి మారుతున్నా.. మన మేకర్స్ ఇంకా పాత ఫార్ములానే నమ్ముకుంటూ కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీయలేకపోతున్నారేమో అనిపిస్తుంది.. అందుకే ఇంటర్నేషనల్ కంటెంట్ ఇండియాలోనూ రూల్ చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగాఫోన్ పట్టిన మాస్ హీరోలు.. డైరెక్షన్‌లోనూ కమర్షియల్ ఫార్ములాపైనే నమ్మకం!

Follow Us