ఇన్‌స్టాగ్రామ్ షాక్.. స్టార్స్‌కు మాస్టర్ స్ట్రోక్

Edited By:

Updated on: May 09, 2026 | 12:41 PM

మన సినీ తారలు సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోయర్స్ కోల్పోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా, నకిలీ, నిష్క్రియ ఖాతాలను తొలగించడమే దీనికి కారణం. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్, రామ్ చరణ్, సమంత, రష్మిక, శ్రద్ధా కపూర్ వంటి అనేక మంది స్టార్లు భారీగా తమ ఫాలోయర్స్ సంఖ్యను కోల్పోయారు. ఈ ప్రక్షాళన ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

మన స్టార్స్‌కి సినిమాలెంత కీలకమో.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా అంతే ముఖ్యం. అక్కడున్న ఫాలోయింగ్‌ని బట్టే వాళ్ల రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాంటిదిప్పుడు రాత్రికి రాత్రే మిలియన్లలో ఫాలోయర్స్ మాయం అయిపోతున్నారు. ప్రక్షాళనలో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఖాతాల్లో లక్షల్లో ఫాలోయర్లు ఎగిరిపోతున్నారు. ఇంతకీ ఏంటిది.. ప్రక్షాళణకు కారణమేంటి.. చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. స్టార్స్‌కు రెండు కళ్లుగా మారిపోయాయిప్పుడు. ఒక్కొక్కళ్లకూ మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. కాకపోతే ఇన్‌స్టా మాతృసంస్థ మెటా ఇప్పుడు ఫేక్ అకౌంట్స్, యాక్టివ్ లేని అకౌంట్స్‌ను ప్రక్షాళన చేసే పనిలో పడింది. దాంతో రాత్రికి రాత్రే మిలియన్లలో ఫాలోయర్లు తగ్గిపోతున్నారు. తెలుగులోనూ అల్లు అర్జున్ సహా అందరి ఫాలోయర్లపై దెబ్బపడింది. అల్లు అర్జున్‌కు నిన్నటి వరకు 28.29 మిలియన్ల ఫాలోయర్లు ఉంటే.. ఇప్పుడు 28.10 మిలియన్లకి పడిపోయారు. అలాగే రామ్ చరణ్ ఫాలోయర్స్ 24.67 మిలియన్స్ నుంచి 24.60కి.. విజయ్ దేవరకొండకు 23.66 నుంచి 23.50 మిలియన్లకు ఫాలోయర్స్ సంఖ్య తగ్గింది. హీరోయిన్లలో సమంత ఫాలోయర్స్ 38.12 నుంచి 37.9 మిలియన్లకు పడిపోతే.. రష్మిక ఫాలోయర్స్ 51.62 నుంచి 51.4 మిలియన్లకు తగ్గారు. ఈ ఇన్‌స్టా ప్రక్షాళన ఎఫెక్ట్ మనకంటే ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్‌పై బలంగా పడింది. ముఖ్యంగా ఇండియాలో హైయ్యస్ట్ ఫాలోయర్స్ ఉన్న శ్రద్ధా కపూర్‌కు ఈ ఎఫెక్ట్ తప్పలేదు. నిన్నటి వరకు 94.69 మిలియన్లు ఉంటే తాజాగా ఆ లెక్క 93.5 మిలియన్లకు తగ్గింది. అలాగే ప్రియాంక చోప్రా ఫాలోయర్స్ 94.59 మిలియన్ నుంచి 93.4కి.. అలియా భట్ ఫాలోయర్స్ 87.9 మిలియన్ నుంచి 85.9కి పడిపోయారు. దీపిక పదుకొనేపై కూడా ఈ ప్రక్షాళన ప్రభావం పడింది. ముందు 80.34 మిలియన్ ఫాలోయర్లు ఉంటే.. ఇప్పుడు ఈ లెక్క 79.2కి చేరింది. కత్రినా కైఫ్ ఫాలోయర్స్ 79.94 మిలియన్ల నుంచి 79 మిలియన్లకి.. సల్మాన్‌కు 72.78 నుంచి 72 మిలియన్‌కు.. అనుష్క శర్మ ఫాలోయర్స్ 68.7 మిలియన్ నుంచి 67.8కి పడిపోయారు. ఈ ప్రక్షాళన ఇంకా కొనసాగేలాగే కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా

ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసుకుని తిన్నారు.. ఆ తర్వాత..

మతిమరుపు… గుండెజబ్బుకు సంకేతమా ?? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు !!

TVK Vijay: మేనిఫెస్టోలోని హామీలన్నీ విజయ్ తీర్చగలడా ??

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

Follow Us