Samantha: సోషల్‌ మీడియాలో సైలెంట్‌ అయిపోయిన సామ్‌.. కారణమేంటంటే..

|

Jul 19, 2022 | 6:14 PM

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. నిత్యం సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. నిత్యం సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అప్పుడప్పుడు సమకాలీన అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇలా ఏదో ఒక రకంగా నెట్టింట్లో చురుకుగా ఉండే సామ్‌.. సడెన్‌గా సైలెంట్‌ అయిపోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టి సుమారు రెండు వారాలు గడిచిపోయింది. ఆమె చివరిగా జూన్‌ 30న ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ తర్వాత ఇన్‌స్టాలో టోటల్‌ సైలెంట్‌. ట్విటర్‌లో కూడా ఎలాంటి అప్‌డేట్స్‌ పెట్టలేదు. దీంతో సామ్‌కు ఏమైందోనని అభిమానులు కలతపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్య సమంత ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సామ్‌ ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ పెట్టలేదు. ఈక్రమంలో సమంత ఎందుకు నెట్టింటికి దూరమయ్యారు? సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారా? లేదా కావాలనే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నారా అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్నాటకలో అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం… మీరెప్పుడైనా చూశారా ??

చెన్నైలో వింత ఘటన !! చెస్‌ బోర్డ్‌లా మారిపోయిన నేపియర్‌ బ్రిడ్జ్‌

నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు !! దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం !!

Published on: Jul 19, 2022 06:14 PM