Ram Charan: చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రష్మిక, కియారా, రుక్మిణి మధ్య హాట్ రేస్!

Edited By:

Updated on: Jul 21, 2026 | 7:21 PM

‘పెద్ది’ విజయానంతరం రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వాని, రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, జాన్వీ కపూర్, ఆలియా భట్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే కీలక పాత్ర కోసం నయనతార పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీని షార్ట్ బ్రేక్ తరువాత స్టార్ట్ చేయబోతున్నారు. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్‌, సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా కనిపించబోయేది ఎవరు? ఆ అవకాశం ఎవరెవరికి దక్కనుంది? అసలు సుక్కు ఛాయిస్ ఏంటి? రామ్ చరణ్ ఓటు ఎవరికి? ఆ డిటైల్స్‌ అన్నింటి మీద ఓ లుక్కేద్దాం పదండి. ప్రజెంట్ పెద్ది సక్సెస్‌ జోష్‌లో ఉన్న రామ్ చరణ్‌, నెక్ట్స్ సుకుమార్ కెప్టెన్సీలో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కియారా అద్వాని మరోసారి చరణ్‌కు జోడీగా నటిస్తారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. కానీ చరణ్, కియారా కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఈ కాంబో విషయంలో ఫ్యాన్స్ కాస్త టెన్షన్‌ పడుతున్నారు. సుకుమార్ తన సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ పుష్ప బ్యూటీ రష్మిక మందన్నను రంగంలోకి దించే ఛాన్స్ కూడా లేకపోలేదన్న టాక్‌ వినిపిస్తోంది. రామ్ చరణ్, రష్మిక తొలిసారి కలిసి నటిస్తే సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుంది. మరోవైపు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న లేటెస్ట్ బజ్‌ ప్రకారం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు కూడా ఈ హీరోయిన్ల రేసులో ఫ్లాష్ అవుతోంది. మరో వైపు బాలీవుడ్ బ్యూటీస్ కూడా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఆల్రెడీ చరణ్‌తో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన జాన్వీ కపూర్, ఆలియా భట్ మరోసారి చరణ్‌తో జోడి కట్టే ఛాన్స్ ఉందన్న అంచనాలు ఉన్నాయి. చరణ్ రీసెంట్ మూవీస్‌లో బాలీవుడ్ భామలే ఎక్కువగా కనిపిస్తుండటంతో.. ఆర్సీ 17కు కూడా నార్త్ బ్యూటీనే ఫైనల్ చేస్తారని ఫ్యాన్స్‌ గట్టిగా నమ్ముతున్నారు. హీరోయిన్ల లిస్ట్ ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారను నటిస్తున్నారన్న న్యూస్‌ వైరల్ అవుతోంది. మరి ఫైనల్‌గా వీళ్లందరిలో సుకుమార్ ఛాయిస్ ఏంటి..? రామ్ చరణ్ ఏ కాంబోకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారు.? తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?

షూటింగ్‌లతో ఫుల్ బిజీ టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ సెట్స్‌పైనే

Anupama Parameswaran: ‘నా గొంతు నేనే వినిపిస్తా’.. అనుపమ ఎమోషనల్ పోస్ట్ వెనక అసలు కథ ఏంటి?

Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!

Ramayana Leak: ‘రామాయణ’ ట్రైలర్ లీక్ వెనక అసలు కథ ఏంటి..? పైరసీనా.. ప్రమోషన్ ప్లానా?

Follow Us