ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్..అందరి టార్గెట్ ఒక్కడే

Edited By:

Updated on: Aug 24, 2026 | 7:51 PM

‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ ట్యాగ్‌పై మరోసారి చర్చ మొదలైంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా మార్కెట్‌ను నిలబెట్టుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఈ రేసులో ముందున్నారని అభిమానులు అంటున్నారు. షారుక్ ఖాన్, అల్లు అర్జున్, యశ్, రణ్‌వీర్ సింగ్ కూడా ఈ పోటీలో ఉన్నారు. రాబోయే ‘ఫౌజీ’, ‘కింగ్’, ‘రాకా’, ‘టాక్సిక్’, ‘ధురంధర్’ సినిమాల ఫలితాలు ఈ ట్యాగ్‌ను ఎవరు దక్కించుకుంటారో నిర్ణయించనున్నాయి.

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. స్పిరిట్ సినిమా కోసం ఈ ట్యాగ్ సందీప్ రెడ్డి వంగా వేసినపుడు చాలా పెద్ద చర్చే.. సారీ సారీ రచ్చే జరిగింది. సౌత్ నుంచి దీనిపై పెద్దగా రియాక్షన్స్ లేకపోయినా.. నార్త్ వాళ్లు మాత్రం ఎగిరెగిరి పడ్డారు. చాలా రోజుల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. మరి ఈసారేంటి విషయం.. ఎందుకింత ట్రెండింగ్.. చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..! ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. ప్రస్తుతం ఈ ట్యాగ్‌కు ప్రభాస్ ఒక్కడే అర్హుడంటున్నారు ఫ్యాన్స్. సౌత్ ఇండస్ట్రీ కూడా ఎస్ అనేసారు. అల్లు అర్జున్, యశ్ కూడా ప్యాన్ ఇండియన్ స్టార్స్ అయినా.. వాళ్లు పుష్ప, KGF బ్రాండ్‌తో బ్లాక్‌బస్టర్స్ కొట్టారు. తాజాగా రాకాతో అల్లు అర్జున్.. టాక్సిక్‌తో యశ్ రప్ఫాడిస్తే అప్పుడు వాళ్లు కూడా ప్రభాస్‌లా సిసలైన ప్యాన్ ఇండియన్ స్టార్స్ అవుతారు. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ ఇండియన్ వైడ్‌గా తన సినిమాలతో సత్తా చూపించారు. సాహో, కల్కి, సలార్ హిందీలోనూ వందల కోట్లు వసూలు చేసాయి. ఈ రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలెవరూ ఇండియన్ ఇండస్ట్రీలోనే లేరు.. అందుకే సందీప్ వంగా స్పిరిట్ కోసం ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఇచ్చారు.. కానీ దీనిపై బాలీవుడ్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా షారుక్ ఫ్యాన్స్ నుంచి..! షారుక్ ఖాన్ ఉండగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఎలా అవుతారంటూ కింగ్ ఫ్యాన్స్ నానా హంగామా చేసారు. అయితే మూడేళ్ల కింద సలార్, డంకీ ఒకేరోజు విడుదలైనపుడు.. ప్రభాసే గెలిచారు. అప్పుడే రెబల్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెప్పారు మావాడే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని..! తాజాగా డిసెంబర్‌లో ఫౌజీతో ప్రభాస్ వస్తుంటే.. కింగ్‌తో షారుక్ వస్తున్నారు. ఫౌజీ వర్సెస్ కింగ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోతారు.. మరోవైపు ఈ ట్యాగ్ కోసం అల్లు అర్జున్, యశ్ లాంటి హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ధురంధర్‌తో రేసులోకి రణ్‌వీర్ సింగ్ వచ్చారు. ప్రస్తుతానికి లెక్కల ప్రకారం ప్రభాస్‌తోనే ఉన్న ఈ ట్యాగ్.. ఫ్యూచర్‌లో ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది వాళ్ళ వాళ్ల సినిమాలే డిసైడ్ చేయాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..

2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?

గంటల తరబడి మొబైల్‌ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!

Loading...
Unable to load recommendations.
Follow Us