Prabhas Missing: ఆదిపురుష్ సూపర్ హిట్టైన వేళ.. ప్రభాస్‌ ఎక్కడ.? ఏమైంది తనకి.?

|

Jun 16, 2023 | 9:52 PM

ప్రభాస్‌! బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియన్ స్టార్గా.. క్రేజ్ కమాయించిన ఈ హీరో.. తాజాగా తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్‌ను ఎట్ ప్రజెంట్ ఫాలో అవుతున్నారు. తన కెరీర్‌ బిగినింగ్ నుంచి.. తన ఫస్ట్ సినిమాను థియేటర్లో చూసే అలవాటున్న ప్రభాస్..

ప్రభాస్‌! బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియన్ స్టార్గా.. క్రేజ్ కమాయించిన ఈ హీరో.. తాజాగా తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్‌ను ఎట్ ప్రజెంట్ ఫాలో అవుతున్నారు. తన కెరీర్‌ బిగినింగ్ నుంచి.. తన ఫస్ట్ సినిమాను థియేటర్లో చూసే అలవాటున్న ప్రభాస్.., హైదరాబాద్లో ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక ముంబాయ్‌ థియేటర్స్‌కు వెళ్లి మరీ.. తన సినిమాలను చూసేశారు. కానీ పాన్ ఇండియన్ స్టార్ గా మారిన తర్వాత.. అక్కడ కూడా ప్రభాస్‌ను గుర్తు పట్టేస్తూ.. ఉండడంతో… ఇప్పుడు ఫారెన్లో తన సినిమాను చూసేందుకు వెళుతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. తన లేటెస్ట్ ఫిల్మ్ ఆదిపురుష్‌ను కూడా… ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రభాస్‌ యూఎస్‌ఏ వెళ్లారట. అక్కడే ప్రైవేట్గా.. ప్రశాంతంగా తన సినిమాను చూసి ఎంజాయ్‌ చేయనున్నారట ప్రభాస్‌. ఇక దాంతో పాటే.. ACL టియర్‌ .. అంటే అంటీరియర్ క్యూరిసియేట్‌ లిగమెంట్ ఇంజూరీ.. నీ ఇంజూరీ..! బాహుబలి టైంలో ఏర్పడిన ఈ ఇంజూరీకి మరో సారి అమెరికాలోనే సర్జరీ చేయించుకోనున్నారట ప్రభాస్‌. ఆ తర్వాత ఆదిపురుష్ సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తూ.. కొన్ని డేస్‌ రెస్ట్ తీసుకుని.. సలార్ మూవీ షూట్‌ను పరిగెత్తించనున్నారట మన డార్లింగ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!