వివాదంలో అనుష్క శ‌ర్మ.. చేతుల‌తో అసభ్యకరమైన సైగ‌లు.. ఫ్యాన్స్ ఆగ్రహం

Updated on: Apr 27, 2026 | 5:20 PM

బెంగళూరులో RCB-GT మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టిన వెంటనే అనుష్క శర్మ అసభ్యకరంగా 'మనీ స్ప్లాషింగ్' సైగలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కెమెరా వైపు చూడగానే సైగలు ఆపేసినా, వీడియో వైరల్ అయ్యింది. మోహన్‌లాల్ ఘటనను గుర్తుచేస్తూ, ఉన్నత స్థాయిలో ఉండి ఇలా చేయడంపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

రాయల్ చాలెంజెర్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య తాజాగా బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో IPL మ్యాచ్‌ జరిగింది. విరాట్ కోహ్లీ అలాగే ప‌డిక్క‌ల్ రాణించడంతో అవలీలగా RCB 5 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్‌ చూస్తున్న అనుష్క శర్మ అసభ్యకరంగా తన చేతులతో సైగలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. మనీ splashing అర్థం వచ్చేలా వేళ్ళు చూపిస్తూ అనుష్క శర్మ అడ్డంగా దొరికిపోయారు. గతంలో మోహన్ లాల్ అసభ్యకరంగా చేతులతో సైగలు చేస్తూ దొరికిపోయిన తరహాలోనే అచ్చం అలాగే అనుష్క శర్మ చేయడం వివాదంగా మారింది. దీంతో క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ఉన్న‌త స్థాయి క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ భార్య అయి ఉండి కూడా అనుష్క ఇంత చీప్ గా వ్యవహరిస్తారా ? ఆమెకు కొంచెమైనా బుద్ది ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్‌. మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేజింగ్ చేసింది. తొమ్మిదో ఓవర్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. సిక్సర్‌ కొట్టిన వెంటనే విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అసభ్యకరంగా వ్యవహరించారు. చేతులతో సైగలు చేస్తూ బిహేవ్ చేశారు. అదే కెమెరా ఆమె వైపు తిప్పగానే… తప్పు చేశానన్న భావన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే చేతులతో సైగలు చేయడం వెంటనే ఆపేశారు. అప్పటికే వీడియో వైరల్ అయింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అనుష్క శర్మ ఇలా వ్యవహరిస్తారా ? ఇది ఇండియ‌న్ క‌ల్చ‌ర్ కాదంటూ మండిప‌డుతున్నారు. దీనిపై అనుష్క శ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు

Follow Us