Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!

Updated on: Oct 30, 2026 | 5:43 PM

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్‌ అమెరికాలో ఇప్పటివరకు 9 లక్షల డాలర్ల కలెక్షన్లు రాబట్టినట్లు డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్‌ వెల్లడించింది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్‌ డ్రామా రాయలసీమలో బ్రిటిష్‌ పాలన కాలం నాటి కరువు పరిస్థితుల నేపథ్యంలో రూపొందింది. ఈ వసూళ్లతో సినిమా మరో బాక్సాఫీస్‌ మైలురాయిని అందుకుంది.

దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన టాలీవుడ్ మూవీ రణబాలి. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ- రష్మిక కాంబోలో వచ్చిన సినిమా ఇది. దీంతో ఈ సినిమా పై రిలీజ్కు ముందే విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. పైగా యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో చాలా జెన్యూన్‌ గా ఈ సినిమాను ఆయన తెరకెక్కించారు. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ మూవీ మాత్రం కమర్షియల్ సినిమాలా కాకుండా.. కాస్త డీసెంట్‌ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్‌ లో మాత్రం తగ్గేదేలే అన్నట్టు.. బాక్సాఫీస్‌ దగ్గర జోరు చూపిస్తూ.. ఇప్పుడేకంగా ఓ రికార్డ్ నే క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ రణబాలి మూవీ ఓవర్‌సీస్‌లో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 9 లక్షల డాలర్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ పంచుకుంది. రాణబాలి మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. బ్రిటీష్ హయాంలో వచ్చిన కరువు పరిస్థితుల ఆధారంగా రూపొందించారు. వరుసగా రెండేళ్లు కరవు రావడంతో దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని డైరెక్టర్ రాహుల్ అన్నారు. అందుకే ఈ కథను ప్రజలకు చెప్పాలనిపించిందని రణబాలి ఈవెంట్‌లో మాట్లాడారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నరకయాతన అంటే ఇదేనేమో.. త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు

కావ్య – అనిరుధ్‌ పెళ్లి వేడుకకు.. ఒకే ఒక్క టాలీవుడ్‌ హీరోకే పిలుపు ..

Sachin Tendulkar: 53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. నేటికీ.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం

ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు..

Published on: Oct 30, 2026 05:42 PM
Loading...
Unable to load recommendations.
Follow Us