నార్త్ Vs సౌత్.. వారణాసిని టార్గెట్ చేస్తున్నారా..?
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై, అలాగే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారణాసి బడ్జెట్, రికవరీ అవకాశాలపై వస్తున్న వ్యాఖ్యలకు మహేష్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదం క్రమంగా సౌత్ వర్సెస్ నార్త్ సినీ పోరుగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
నార్త్ వర్సెస్ సౌత్ పోరు మొదలైందా..? ఇటు వారణాసి.. అటు రామాయణ రెండూ భారీ బడ్జెట్‌తోనే వస్తున్నాయి. కానీ కేవలం వారణాసిని మాత్రమే నార్త్ టార్గెట్ చేస్తుందా..? 4 వేల కోట్లతో వస్తున్న రామాయణ బడ్జెట్ రికవరినీ వదిలేసి.. తెలుగు నుంచి వస్తున్న వారణాసి రికవరీపై వాళ్లెందుకు క్వశ్చన్ చేస్తున్నారు..? కావాలనే రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారా..? అసలేం జరుగుతుంది చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. వారణాసి, రామాయణ.. రెండూ ఇండియన్ సినిమా నుంచి బిగ్గెస్ట్ సినిమాలే. ఒకటేమో ఏకంగా 4 వేల కోట్ల బడ్జెట్‌తో వస్తుందని నిర్మాతలే స్వయంగా చెప్తే.. మరోటి 1200 కోట్లతో రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఒకటి నార్త్ నుంచి.. మరోటి సౌత్ నుంచి వస్తుండటమే ఇప్పుడు అసలు రచ్చకు కారణమవుతుంది. రాజమౌళి సినిమాలపై ఉండే అంచనాలు.. వాటి బిజినెస్ లెక్కల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటినే బేస్ చేసుకుని నార్త్‌లో వారణాసిపై కుట్ర జరుగుతుందంటున్నారు మహేష్ ఫ్యాన్స్. కావాలనే బడ్జెట్‌నే హైప్ చేసి చూపిస్తున్నారని.. 1200 కోట్లు ఎలా రికవర్ అవుతాయి.. ఓటిటి కావట్లేదు.. వారణాసి బయటపడటం కష్టమే అనే ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. రామాయణను ఉదాహరణగా చూపిస్తూ.. 4 వేల కోట్లతో వస్తున్న రామాయణకే రికవరీ సాధ్యమవుతుందని నిర్మాతలు చెప్తున్నపుడు.. వారణాసికి ఎందుకు కాదంటూ కౌంటర్ వేస్తున్నారు ఫ్యాన్స్. రామాయణ Vs వారణాసి కాస్తా.. సౌత్ Vs నార్త్ పోరుగా మారిపోయేలా ఉందిప్పుడు. సోషల్ మీడియాలో ఉన్నట్లుండి వారణాసి, రామాయణ బాగా ట్రెండ్ అవుతున్నాయి. రాజమౌళికి బడ్జెట్ ఎప్పుడూ ఇష్యూ కాదు.. పదేళ్ల కిందే బాహుబలికి 400 కోట్లు ఖర్చు పెట్టించి 1800 కోట్లు తెచ్చారు. ట్రిపుల్ ఆర్‌కు 400 కోట్లు పెట్టినా.. 1300 కోట్లు వచ్చాయి. వారణాసికి ఎంతపెట్టినా జక్కన్నకు తన ప్లాన్స్ తనకి ఉంటాయి. గ్లోబల్ ఆడియన్స్‌కు ఈ చిత్రాన్ని రీచ్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు రాజమౌళి. మొత్తానికి ఈ సౌత్ వర్సెస్ నార్త్ పోరులో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్ విషయాలు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు