ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒకే వధువును పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు వరులు ఊరేగింపుగా రావడంతో పెళ్లి మండపం రణరంగంగా మారింది. నిశ్చితార్థం రద్దయిన మొరాదాబాద్ వరుడు, కొత్తగా నిశ్చయమైన సంభాల్ వరుడు పోటీపడటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. చివరకు వధువు కుటుంబం సంభాల్ వరుడిని ఎంచుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటన యూపీలో చర్చనీయాంశమైంది.
సినిమాల్లో కూడా ఊహించని రేంజ్‌లో ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఒకే పెళ్లి వేదిక.. ఒకే వధువు.. కానీ ఊరేగింపుగా ఇద్దరు వరులు రావడంతో అక్కడ ఉన్నవారందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ విచిత్ర పెళ్లి పంచాయితీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అమ్రోహా జిల్లాకు చెందిన ఓ యువతికి మొదట మొరాదాబాద్‌కు చెందిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది. వెంటనే వధువు కుటుంబ సభ్యులు సంభాల్‌కు చెందిన మరో వ్యక్తితో సంబంధం కుదుర్చుకున్నారు. ఖర్చులు కలిసి వస్తాయని, పాత ముహూర్తానికే పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. నిశ్చితార్థం రద్దయినా మొరాదాబాద్ వరుడు వెనక్కి తగ్గలేదు. అప్పటికే కార్డులు పంచేసామని, తాను అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానని మొండికేసి బ్యాండ్ బాజాలతో పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అదే సమయానికి కొత్తగా నిశ్చయమైన సంభాల్ వరుడు కూడా ఊరేగింపుగా రావడంతో పెళ్లి మండపం కాస్తా యుద్ధభూమిగా మారిపోయింది. ఒకే అమ్మాయి కోసం ఇద్దరు వరులు పోటీ పడటంతో వధువు కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రొట్టెకోసం రెండు పిల్లులు కొట్టుకున్న చందంగా ఇద్దరి వరుల కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ ముదరడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అసలు విషయం తెలుసుకున్న ఖాకీలకు కూడా ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు పోలీసులు ఈ నిర్ణయాన్ని వధువు కుటుంబానికే వదిలేశారు. వధువు తరపు వారు తాము కొత్తగా నిశ్చయించుకున్న సంభాల్ వరుడికే ఓటు వేయడంతో.. మొరాదాబాద్ నుంచి వచ్చిన పెళ్లికొడుకు ఇక మొరాయించి లాభం లేదని భావించి, తన బరాత్‌తో వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు ముక్కోణపు ప్రేమకథలు విన్నాం కానీ, ఇలా ముక్కోణపు పెళ్లి బరాత్‌లు చూడలేదంటూ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త యూపీలో సెన్సేషన్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు
ఈ వీకెండ్ సినిమా సెట్టు..OTTలో అద్భుతమైన హర్రర్ కామెడీ మూవీ..
Dhurandhar: 3వేల కోట్ల వసూళ్లతో.. ఇండియాలోనే ‘నెంబర్ 1’ గా ధురంధర్
