భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు
బహ్రెయిన్‌లో యుద్ధ భయాలు నెలకొన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇరాన్‌పై దాడులు, ప్రతీకార చర్యలతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా, తెలుగు ఫ్యాన్స్ 'జై పవర్ స్టార్' నినాదాలతో, కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, పవన్ ఫ్యాన్స్ తగ్గేదే లే అని నిరూపించాయి.
2026 ఫిబ్రవరి చివరలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి, బహ్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల బహ్రెయిన్‌లోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు మరియు పౌర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దేశ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ఈ భీకర పరిస్థుతుల్లో.. మన తెలుగు వాళ్లు.. అందున పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికులు మాత్రం.. తమ అభిమాన హీరో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ.. పండగ చేసుకుంటున్నారు. ఓ పక్క యుద్ధ జరుగుతున్నా కూడా… పవర్ స్టార్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు బహ్రయిన్‌లో ఉన్న తెలుగు వాళ్లు. ఉస్తాద్ ప్రీమియర్స్ రోజు కేక్ కట్ చేశారు హంగామా చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పరిస్తితి ఏదైనా.. పవన్ ఫ్యాన్స్ తగ్గేదే లే అనే కామెంట్ ను వచ్చేలా చేసుకుంటున్నాయి. ఇక హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. తమిళ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అలాగే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్షన్, మాస్, ఎలిమింట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్
Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..
Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్ రేట్ల పై బంపర్ ఆఫర్
