Krithi Shetty: దేవుడిదే భారం అంటున్న ఉప్పెన బ్యూటీ.. అదృష్టం అడ్డం తిరిగింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..
వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి మొదటి సినిమాతోనే తనదైన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు.
వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి మొదటి సినిమాతోనే తనదైన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. యంగ్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీకి ఇటీవలే ఫస్ట్ ఫ్లాప్ ఎదురైంది. రీసెంట్ గా కృతి నటించిన వారియర్ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. రామ్ హీరోగా వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయినా కృతికి ఆఫర్లు క్యూ కడుతూనే ఉన్నాయి.అయితే కృతి శెట్టికి ఇప్పడు మంచి హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. లేకపోతే కేరీర్ గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కృతి సుధీర్ బాబు సరసన నటిస్తున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా హిట్ కావాలని కృతి శెట్టి తన తల్లితో కలిసి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా హిట్ అయితే దేవుడికి వెండి కిరీటం చేయిస్తానని భారీ మొక్కును కూడా మొక్కినట్టు టాక్. ఇటీవలే తన తల్లితో కలిసి కృతి శెట్టి గుడికి వెళ్లిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి కృతి కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

