Upasana Konidela: ‘నా భర్త కౌంట్ 199 ‘ చరణ్‌ సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన

Updated on: Aug 14, 2025 | 1:00 PM

టీనేజ్‌ ఓ మొబైల్‌ ఫోన్ కొనుక్కున్న దగ్గర నుంచి, టిల్ ఎజ్‌ అయిపోయి ఇంట్లో కూర్చునే వరకు ఎవరైనా ఎన్ని ఫోన్ నంబర్లు మారుస్తారు. మా అంటే ఐదంటారా? లేదా పదంటారా? కాదు కాదు పాతిక అంటారా? అయితే మీ చెప్పు ఈ నెంబర్స్‌కు దూరంగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ నెంబర్‌ ఉంది. తన భర్త ఎన్ని సార్లు ఫోన్ నెంబర్స్ మార్చాడో తెలుసా అంటూ.. ఈ విషయాన్ని తాజాగా ఉపాసన రివీల్ చేసింది.

దీంతో ఈ టాపిక్ కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. సెలబ్రిటీలు తరచుగా తమ ఫోన్ నంబర్లను మార్చుకుంటారు. అందుకు చాలా కారణాలున్నాయి. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పలు కారణాల వల్ల తన ఫోన్ నెంబర్‌ను మార్చారట. అది కూడా వందల సార్లు తన ఫోన్ నంబర్‌ను మార్చారన చెర్రీ. ఇప్పటి వరకు తన భర్త రామ్ చరణ్ 199 సార్లు తన మొబైల్‌ నెంబర్‌ని మార్చారని రీసెంట్‌ ఓ ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పారు. ప్రస్తుతం చరణ్ వాడుతున్నది 200వ నెంబర్‌ అంటూ రీవీల్ చేశారు. అంతేకాదు అందుకే తన భర్త కాంటాక్ట్ నేమ్ ను ‘రామ్‌ చరణ్‌ 200’ అని సేవ్‌ చేసుకున్నా అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఈమె. రామ్ చరణ్ 2007 లో చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. అయితే వీటిలో ఏ సినిమా మీకు బాగా నచ్చిందని ఉపాసనను అడిగితే.. ‘RRR’ అని బదులిచ్చింది ఉపాసన. రామ్ చరణ్ తన సినిమా కెరీర్‌లో ఈ మూవీ కోసమే ఎక్కువగా వర్క్ చేశాడని కూడా ఉప్సీ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాలరి పంట పండిందిగా.. వలలో చిక్కింది చూసి షాక్

రైల్వే సరికొత్త ఆఫర్.. టికెట్ ధరలో రాయితీ

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక ఫోటోలన్నీ

వేరుశనగ గొంతులో ఇరుక్కొని మృతి.. శోకసంద్రంలో కుటుంబం