ప్రభాస్ కోసం పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్న దర్శకులు

Edited By:

Updated on: May 24, 2026 | 9:56 PM

ప్రభాస్ ఒక్కరే కాదు.. ఆయన దర్శకులు కూడా రెబల్ స్టార్‌కు తగ్గట్లుగానే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయాల్సి వచ్చినా కూడా.. దానికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ప్రశాంత్ నీల్ కూడా చేరిపోయారిప్పుడు. ఈయన సలార్ 2పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. మరి ఆయనేం చెప్పారు..? ఇంతకీ సలార్ 2 శౌర్యంగ పర్వం పట్టాలెక్కేదెప్పుడు..?రాజా సాబ్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన ప్రభాస్.. చాలా బిజీ అయిపోయారిప్పుడు. ఓవైపు స్పిరిట్.. మరోవైపు కల్కి 2.. ఇంకోవైపు ఫౌజీ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. హైదరాబాద్‌లోనే కొన్ని రోజులుగా ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 షూటింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి స్పిరిట్ సెట్‌లో ఉన్నారీయన. మరో 20 రోజుల పాటు ఇదే సెట్‌లో కంటిన్యూ అవుతారు.

రెండు మూడు సినిమాలు ఒకేసారి చేయకూడదని ప్రభాస్ ఎంతగా నిర్ణయించుకున్నా.. ఆయన కమిట్‌మెంట్స్ మాత్రం సహకరించడం లేదు. కచ్చితంగా ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే ఫౌజీ చివరి దశకు వచ్చేసింది.. కల్కి 2, స్పిరిట్ మాత్రమే భారీ షెడ్యూల్స్ బాకీ ఉన్నాయి.2026 అంతా స్పిరిట్, కల్కి 2నే కంటిన్యూ కానున్నారు ప్రభాస్. స్పిరిట్ కోసం బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. ప్రజెంట్ షెడ్యూల్ కూడా 30 రోజులు నాన్ స్టాప్ సాగనుంది. ఇక కల్కి 2లో ప్రస్తుతం కమల్ హాసన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే జాయిన్ అవుతారు. మరోవైపు సలార్ 2 అప్‌డేట్ ఇచ్చారు నీల్. డ్రాగన్ తర్వాత నెక్ట్స్ సినిమా అదే అన్నారీయన. సలార్ 2 కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆదిపురుష్, రాధే శ్యామ్ లాంటి ఫ్లాపుల్లో ఉన్న రెబల్ స్టార్‌ను మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేలా చేసింది సలారే కాబట్టి ఫ్యాన్స్‌కు ఈ సినిమా స్పెషల్ ఎమోషన్. డ్రాగన్ పూర్తి కాగానే.. తన ఫోకస్ అంతా సలార్ 2పైనే పెడతానని కన్ఫర్మ్ చేసారు ప్రశాంత్ నీల్. ఈ లెక్కన 2027లో స్టార్ట్ చేస్తే.. 2028 సమ్మర్ నాటికి శౌర్యంగ పర్వం ఊహించొచ్చు.

మరిన్ని వీడియో కోసం : 

న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!

జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ

చాలా ఏళ్లుగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్‌ఖాన్

దృశ్యం 3 హిట్టా..? ఫట్టా..?

Published on: May 24, 2026 09:56 AM
Follow Us