God Of War: డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’.. తారక్ కోసం గురూజీ మైథాలజీ మ్యాజిక్!

Edited By:

Updated on: Jul 21, 2026 | 6:05 PM

ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించనున్న ‘గాడ్ ఆఫ్ వార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తికేయ స్వామి జన్మ రహస్యాలు, యుద్ధ వైభవం, పౌరాణిక విశేషాలను కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉత్తరంలో జన్మించి దక్షిణంలో ఆరాధించబడే దేవుడనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ మైథాలజికల్ చిత్రం చుట్టూ ఇప్పటికే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది..? కొత్తగా ఈ సినిమాలో కార్తికేయుడి గురించి మాటల మాంత్రికుడు ఏం చెప్పబోతున్నారు..? చరిత్రలో తెలియని నిజాలు ఈ సినిమాలో చూపించబోతున్నారా..? తమిళ కాంట్రవర్సీ గురించి గురూజీ లైట్ తీసుకున్నారా..? అసలు తారక్‌తో ఎలాంటి మైథలాజికల్ సబ్జెక్ట్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు..? ఈ జనరేషన్ దర్శకులలో పౌరాణికాల గురించి త్రివిక్రమ్‌కు ఉన్నంత పట్టు మరో దర్శకుడికి లేదు. ప్రతీ సినిమాలోనూ పురాణాలతో ముడిపెడుతూ మాటలు రాస్తుంటారీయన. అలాంటి దర్శకుడి నుంచి నిజంగా ఓ మైథాలజీ సినిమా వస్తే ఎలా ఉంటుంది..? అందుకే కార్తికేయుడిపై గురూజీ ప్రకటించిన గాడ్ ఆఫ్ వార్ సినిమాపై అంత ఆసక్తి., అన్ని అంచనాలున్నాయి. ఉత్తరంలో జన్మించి, దక్షిణంలో ఆరాధించబడే దేవుడు అనే కాన్సెప్ట్‌‌తోనే త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా రానుంది.. దీనిచుట్టూనే వివాదం రాజుకుంది. కానీ పూర్తి కథను ఇప్పటి వరకు మేకర్స్ చెప్పలేదు. ఇందులో కార్తికేయుడి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు, విషయాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆయన జన్మరహస్యంతో పాటు యుద్ధాలపైనే ఎక్కువగా గురూజీ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆదర్శ కుటుంంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. డిసెంబర్ నుంచి గాడ్ ఆఫ్ వార్ షురూ చేయనున్నారు. ఆలోపు తారక్ కూడా డ్రాగన్ షూటింగ్ నుంచి ఫ్రీ కానున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి కార్తికేయ స్వామి గురించి ఎన్నో రహస్యాలను ఇందులో చూపించాలనేదే త్రివిక్రమ్ ప్రయత్నంగా కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జెన్ జీకి హాలీవుడ్ ఫీవర్.. తెలుగు సినిమాలు ఎందుకు కనెక్ట్ కావడం లేదు?

మెగాఫోన్ పట్టిన మాస్ హీరోలు.. డైరెక్షన్‌లోనూ కమర్షియల్ ఫార్ములాపైనే నమ్మకం!

Follow Us