Trisha: త్రిష అను నేను.. 15 ఏళ్ళ క్రితం నుండే రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసిందా
నటి త్రిష రాజకీయ ప్రవేశం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. 15 ఏళ్ల క్రితమే సీఎం కావాలని కలలు కన్న త్రిష, ఇప్పుడు విజయ్ మద్దతుతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ స్థాపించిన TVK పార్టీలో ఆమెకు కీలక స్థానం దక్కనుందని, ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే నటి త్రిష, రాజకీయ నాయకురాలిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్రిష లైఫ్‌లో ఏం జరుగుతోంది..? ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇంకోవైపు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. 15 ఏళ్ల క్రితమే సీఎం అవ్వాలని కలలు కన్న త్రిష.. ఇప్పుడు విజయ్ సపోర్ట్‌తో పాలిటిక్స్‌లో అరంగేట్రం చేయబోతున్నారా..? ఆయన స్థాపించిన TVKలో త్రిష ప్లేస్ ఏంటి..? ఈ రాజకీయ చదరంగంలో త్రిష రోల్ ఏంటి..? వింటున్నారుగా త్రిష చెప్పింది.. ఈ మాట ఇప్పుడు కాదు 15 ఏళ్ల కిందే చెప్పారీమే. తనకు సీఎం అవ్వాలని ఉందని.. 15 ఏళ్ళ తర్వాత చూడండి అంటూ ఓపెన్‌గా చెప్పారు త్రిష. దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. విజయ్ TVK పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడంతో.. త్రిష కూడా పాలిటిక్స్‌లోకి రావడం ఖాయమని కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. రాబోయే ఎలక్షన్స్‌లో ఈమె పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. చెన్నైలోని ఒక ముఖ్యమైన నియోజకవర్గం నుంచి త్రిషకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా విజయ్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు తమిళ రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ విడాకుల వెనక కూడా త్రిష పేరే ప్రధానంగా వినిపిస్తుంది. పైగా తాజాగా కలిసి ఓ పెళ్లికి హాజరైంది ఈ జంట. ఈ డాట్స్ అన్నీ కరెక్టుగా కనెక్ట్ అవుతుండటంతో.. త్రిష పొలిటికల్ స్కెచ్ అదిరిపోయిందంటున్నారు విశ్లేషకులు. త్రిష లైఫ్‌లో ఏదో పెద్ద మార్పు జరగబోతోందని.. విజయ్‌తో ఈమె బాండింగ్ కేవలం సినిమాలకే పరిమితం కాదనే చర్చ నడుస్తుంది. టీవీకేలో త్రిషకు కీలకమైన స్థానం దక్కబోతోందని కోలీవుడ్ టాక్. తన క్రేజ్, ఫాలోయింగ్‌తో పక్కా వ్యూహంతోనే త్రిష పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి త్వరలోనే హీరోయిన్ త్రిష కాస్తా.. పొలిటికల్ లీడర్ త్రిషగా మారే అవకాశం లేకపోలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్
జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు
కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?
Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..