Sreeleela: ఇప్పటికైనా అలర్ట్ కాకుంటే కష్టమే.. శ్రీలీలకు అర్థమవుతోందా ??

Edited By:

Updated on: Dec 29, 2025 | 5:07 PM

2025లో పలువురు తెలుగు స్టార్ హీరోయిన్లకు ఆశించిన విజయాలు దక్కలేదు. శ్రీలీల, అనుష్క, కీర్తి సురేష్, రాశి ఖన్నా వంటి తారలు పెద్ద హిట్‌లు నమోదు చేయడంలో విఫలమయ్యారు. బ్లాక్‌బస్టర్‌ ఫేమ్‌, రీఎంట్రీ, విజయవంతమైన ప్రాజెక్ట్‌ల ఎంపికలో వారు సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కెరీర్ రివ్యూ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని విశ్లేషణ.

2025 ప్రోగ్రెస్‌ కార్డు అందుకున్న కొంత మంది హీరోయిన్లు.. అసలు ఏం జరిగిందా? అని కెరీర్‌ని రివ్యూ చేసుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది. లైమ్‌ లైట్‌లోకి రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, లైట్‌లైట్‌లో ఓ వెలుగు వెలిగిన వీళ్ల మీద, ఈ ఏడాది ఎందుకు ఫ్లాప్‌ నీడలు పడ్డట్టు? చూసేద్దాం రండి. వైరల్‌ వయ్యారి నేను అంటూ శ్రీలీల సెల్ఫ్‌ గా ఎంత చెప్పుకున్నా.. ఆ రేంజ్‌లో మాత్రం వైరల్‌ కావడం లేదు ఈ బ్యూటీ. లాస్ట్ ఇయర్‌ ఎండింగ్‌లో కిస్సిక్‌ అంటూ పుష్ప ఫేమ్‌ని సొంతం తాను కూడా సొంతం చేసుకున్నా, ఈ ఏడాది ఆ వెలుగుల్ని రిఫ్లెక్ట్ చేయలేకపోయారు శ్రీలీల. రాబిన్‌హుడ్‌, మాస్‌ జాతర, జూనియర్‌.. ఏదీ ఆమెకు బ్లాక్‌ బస్టర్‌ ఫేమ్‌ని ఇవ్వలేకపోయాయి. సీనియర్‌ బ్యూటీ అనుష్కకు కూడా 2025 కలిసిరాలేదు. రీఎంట్రీలో ఫర్వాలేదు.. జాగ్రత్తగానే డీల్‌ చేస్తున్నారనే పేరు తెచ్చుకున్న అనుష్క, 2025లో మాత్రం ఆ పేరు నిలుపుకోలేకపోయారు. దాంతో కొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ప్రకటించేశారు. ఘాటితో డీలా పడ్డ ఆమె, నెక్స్ట్ స్టెప్‌ ఎలా ఉంటుందన్నది ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ కలిగిస్తున్న విషయం. కీర్తి సురేష్‌ ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నారు గానీ, అద్భుతమైన హిట్‌ అయితే ఆమెకు ఈ ఏడాది పడలేదు. మంచి పెర్ఫార్మర్‌ అనే పేరుంది, ఈ మధ్య కాస్త గ్లామరస్‌గా కనిపించడానికీ అడ్డు చెప్పడం లేదు… అయినా కీర్తిని వెతుక్కుంటూ సక్సెస్‌ ఫుల్‌ ప్రాజెక్టులు రావడం లేదా? వాటిని సెలక్ట్ చేసుకోవడంలో ఆమె తడబడుతున్నారా? అనేది చాలా మందికి అర్థం కాని విషయం. ఈ ఏడాది టాలీవుడ్‌ని టచ్‌ చేసిన మరో లేడీ రాశీ ఖన్నా. తెలుసు కదాలో నటించారు రాశీఖన్నా. అయితే ఆ మూవీకి ఆమె ఆశించినంత పేరు రాలేదు. నెక్స్ట్ ఇయర్‌ పవన్‌ ఉస్తాద్‌తో అయినా మళ్లీ తానేంటో ప్రూవ్‌ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు రాశీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ

ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..

షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే