టాలీవుడ్‌లో మైథలాజికల్ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్ హీరోలు!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు మైథలాజికల్, డివోషనల్ కథలపై ఫోకస్ చేస్తున్నారు. చిరంజీవి ‘విశ్వంభర’, రాజమౌళి-మహేష్ బాబు ‘వారణాసి’, ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’, ప్రభాస్ ‘కల్కి 2’ వంటి సినిమాలు పురాణాలు, దేవుళ్లు, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు ‘రామాయణ’, ‘మహాకాళి’, ‘మహావతార్’ వంటి భారీ ప్రాజెక్టులు కూడా క్యూలో ఉన్నాయి. దీంతో రాబోయే రెండుమూడేళ్లలో తెలుగు తెరపై మైథలాజికల్ సినిమాల సందడి పెరగనుంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు రూట్ మార్చారు. మన హీరోలంతా మైథలాజికల్, డివోషనల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ మారుతూ ఉండటంతో, రాబోయే రోజుల్లో ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తడానికి, పురాణ గాథలను గ్రాండ్‌గా ప్రెజెంట్ చేసేందుకు మేకర్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏ స్టార్ హీరో ఏ మైథలాజికల్ మూవీతో రాబోతున్నారు.
మన హీరోలు దేవుడి కాన్సెప్ట్, ఫాంటసీ టచ్ ఉన్న మైథలాజికల్ కథలతో పాన్ ఇండియా ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో తెలుగు బాక్సాఫీస్ దగ్గర దేవుళ్ల సందడి ఓ రేంజ్‌లో ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోషియో ఫాంటసీ, పౌరాణిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణంలోని ఓ ప్రధాన ఘట్టాన్ని తెర మీద ఆవిష్కరించబోతున్నారు. ఈ ఎపిసోడ్‌లో మహేష్ శ్రీరాముడిగా కనిపిస్తారని ఇప్పటికే కన్ఫార్మ్ చేసింది మూవీ టీమ్. 20 నిమిషాల ఈ ఎపిసోడ్ సినిమాకై హైలెట్ అంటోంది మూవీ టీమ్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న ‘జై హనుమాన్’ మీద అంచనాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ మైథలాజికల్ టచ్ ఉన్న కథలతో గ్లోబల్ రేంజ్‌లో సత్తా చాటుతున్నారు. ‘కల్కి 2898 ఏడీ’తో సంచలనం సృష్టించిన ప్రభాస్, ఇప్పుడు ‘కల్కి పార్ట్ 2’ కోసం రెడీ అవుతున్నారు. 2027లో రానున్న ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్‌లో రామాయణ, జనవరిలో ‘మహాకాళి’, డిసెంబర్ లో ‘మహావతార్’ లాంటి డివోషనల్ సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. భారీ వీఎఫ్ఎక్స్ రూపొందుతున్న డివోషనల్ మూవీస్ థియేటర్లలో రచ్చ చేస్తున్నాయి. అందుకే అప్ కమింగ్ లిస్ట్‌లో ఉన్న మైథలాజికల్ డివోషనల్ మూవీస్ మీద అంచనాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్ హీరోయిన్ల కొత్త రూట్!
Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?
USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్
