TOP 9 ET: ప్రభాస్ సింగిల్ దెబ్బకే 140 కోట్లు | రామ్ చరణ్ విషయంలో అన్నీ అబద్దాలే..

|

Jun 17, 2023 | 9:26 PM

హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న.. మోస్ట్ అవేటెడ్ స్పై మూవీ వార్ 2. ఆయాన్ ముఖర్జి డైరెక్షన్లో.. వార్ 1 కు సీక్వెల్‌గా వస్తున్న ఈసినిమాలో.. బాలీవుడ్ హీరోయిన్‌ కియారా హీరోయిన్ గా చేస్తున్నారట. అయితే యంట్ టైగర్‌ కు జోడీగానా.. లేక హృతిక్ కు జోడీగా..

01. kiara
హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న.. మోస్ట్ అవేటెడ్ స్పై మూవీ వార్ 2. ఆయాన్ ముఖర్జి డైరెక్షన్లో.. వార్ 1 కు సీక్వెల్‌గా వస్తున్న ఈసినిమాలో.. బాలీవుడ్ హీరోయిన్‌ కియారా హీరోయిన్ గా చేస్తున్నారట. అయితే యంట్ టైగర్‌ కు జోడీగానా.. లేక హృతిక్ కు జోడీగానే అనే విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్ టేస్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.

02. Bhagavanth
అడవి బిడ్డ నేల కొండ భగవంత్‌ కేసరిగా దసరాకి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఈ కమ్రంలోనే హైదరాబాద్‌లో వేసీన ఓ భారీ సెట్లో … షూటింగ్‌ను పరిగెత్తిస్తున్నాడు. యాక్షన్ సీన్స్‌ చేస్తూ… అందర్నీ హడలెత్తిస్తున్నాడు.

03. leo
లోకేష్ కనగరాజ్‌ డైరెక్షన్లో…. దళపతి విజయ్‌ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ లియో. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ కానుంది. విజయ్‌ పుట్టిన రోజు సందర్బంగా జూన్‌22న ఈ సింగిల్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా అనౌన్స్ చేశారు లోకేష్‌.

04. kangana
జీవితంలో ప్రతిదానికీ ఓ సందర్భం ఉందంటున్నారు నటి కంగన. తన జీవితంలో పెళ్లి జరగాలని రాసి పెట్టి ఉంటే, జరిగి తీరుతుందని చెప్పారు. తనకు కూడా పెళ్లి చేసుకుని సెటిల్‌ కావాలని ఉందని, తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని ఉందని అన్నారు. ఆమె ప్రొడక్షన్‌లో తెరకెక్కిన టీకు వెడ్స్ షేరు సినిమా ప్రమోషన్లలో తాజాగా ఈ విషయాలు చెప్పి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ.

05. lgm
ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా ఎల్జీఎం. తమిళ్‌, తెలుగులో రిలీజ్ కానున్న తమిళ్ డైరెక్టర్‌ మణి డైరక్ట్ చేస్తున్నారు. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్‌ని, ఆడియోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

06. vijay devarakonda
విజయ్‌ దేవరకొండ బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఆయన నటిస్తున్న ఖుషి సెట్స్ మీద ఉంది. ఇప్పుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్‌ స్టార్ట్ అయింది.ఇందులో విజయ్‌ గూఢచారిగా కనిపిస్తారు. శ్రీలీల హీరోయిన్. మరోవైపు పరశురామ్‌ డైరెక్షన్లో నటిస్తున్న సినిమా షూటింగ్‌, వచ్చే నెల నుంచి స్టార్ చేయనున్నారు VD

07.Yash
కేజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు యశ్.. ఎట్టకేలకు మరో సిరిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. కేజీఎఫ్2 వచ్చి యేడాదైనా ఇప్పటి వరకు ఏ సినిమాను మొదలెట్టిన ఈ క్రేజీ హీరో… తాజాగా మలయాళ డైరెక్టర్‌ గీతు మోహన్ దాస్‌తో.. సినిమా చేయబోతున్నారట. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కూడా జరుగుతోందని..రేపో మాపో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తోందని శాండల్‌ వుడ్లో ఓ స్ట్రాంగ్ టాక్ రన్‌ అవుతోంది.

08.RC16
బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి,. గతంలో ఎన్టీఆర్‌తో చేయాలనుకున్న కథనే ఇప్పుడు చరణ్‌తో చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే అందులో నిజం లేదని.. బుచ్చిబాబు చేస్తోంది వేరే స్క్రిప్ట్ అని మేకర్స్ తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

09. Adipuruh
మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ బద్దలయ్యేలా చేశారు. తన మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్‌తో.. ఫస్ట్ డే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ ఏకంగా 140 క్రోర్ గ్రాస్‌ వచ్చేలా చేసుకున్నారు. అంతేకాదు.. బాహుబలి2, సాహో.. రాధేశ్యామ్‌… ఆదిపురుష్‌ ఇలా వరుసగా… తన నాలుగు సినిమాలతో డే1 వంద కోట్ల పైగా వసూళ్లు రాబట్టి…. ఇండియన్ సినిమాస్ బాక్సాఫీస్ కింగ్‌ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటున్నారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!