TOP 9 ET: క్లీన్‌గా హాయ్‌ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్.

|

Dec 05, 2023 | 11:18 AM

నాని, మృణాల్‌ జంటగా నటించిన సినిమా హాయ్‌ నాన్న. ఈ సినిమాకు సెన్సార్‌ క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ నెల 7న విడుదల కానుంది హాయ్‌ నాన్న. తండ్రీ కూతురు అనుబంధంతో తెరకెక్కింది. సకుటుంబంగా చూడదగ్గ సినిమా అని అన్నారు నాని. థియేటర్లలో విడుదలై మైండ్‌ బెండింగ్‌ బ్లాక్‌బస్టర్‌గా పేరు తెచ్చుకున్న మా ఊరి పొలిమేర2 సినిమా ఆహాలో ప్రసారం కానుంది. ఈ నెల 8నుంచి ఆహాలో డిజిటల్‌ ప్రీమియర్స్ మొదలుకానున్నాయి.

1.Hi nanna
నాని, మృణాల్‌ జంటగా నటించిన సినిమా హాయ్‌ నాన్న. ఈ సినిమాకు సెన్సార్‌ క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ నెల 7న విడుదల కానుంది హాయ్‌ నాన్న. తండ్రీ కూతురు అనుబంధంతో తెరకెక్కింది. సకుటుంబంగా చూడదగ్గ సినిమా అని అన్నారు నాని.

02.Polimera 2
థియేటర్లలో విడుదలై మైండ్‌ బెండింగ్‌ బ్లాక్‌బస్టర్‌గా పేరు తెచ్చుకున్న మా ఊరి పొలిమేర2 సినిమా ఆహాలో ప్రసారం కానుంది. ఈ నెల 8నుంచి ఆహాలో డిజిటల్‌ ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. సత్యం రాజేష్‌ ప్రధాన పాత్రలో నటించారు. డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు.

03.Nani (for feed check tirupathi folder)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటుడు నాని. ఆయన నటించిన హాయ్‌ నాన్న ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలో విలేకరులతోనూ మాట్లాడారు. హాయ్‌ నాన్న ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా అవుతుందని అన్నారు నాని.

04.Na sami ranga
నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా నా సామి రంగ. విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ నాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. హీరోయిన్‌ పాత్రను పరిచయం చేస్తూ తాజాగా ఓ స్పెషల్‌ గ్లింప్స్ విడుదలైంది.

05.Krithi sanon
ట్రేడింగ్‌ మాధ్యమాలను సపోర్ట్ చేస్తూ తాను మాట్లాడినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు నటి కృతి సనన్‌. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫార్మ్ లతో తనకు అనుబంధం లేదని చెప్పారు. తప్పుడు వార్తల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం కృతి చేతిలో మూడు బాలీవుడ్‌ సినిమాలున్నాయి.

06.Bobby deol
యానిమల్‌ సినిమాలో విలన్‌గా నటించారు బాబీ డియోల్‌. తన కేరక్టర్‌ ప్రేక్షకులకు నచ్చినందుకు భావోద్వేగానికి గురయ్యారు బాబీ. యానిమల్‌ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు బాబీ. యానిమల్‌లో లుక్‌ కోసం మూడు నెలల పాటు స్వీట్లు తినడం మానేశారు బాబీ.

07.Yash
యష్‌ హీరోగా నటించే 19వ సినిమా టైటిల్‌ను ఈ నెల 8న ఉదయం 9.55కి ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. కేవీయన్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. గీతూ మోహన్‌దాస్‌ డైరక్షన్‌ చేస్తారని సమాచారం. కేజీయఫ్‌2 తర్వాత యష్‌ నటిస్తున్న సినిమా ఇదే.

08.1dunky
డంకీ సినిమాలో నికలె ది కబీ హమ్‌…. అనే పాటను తొలిసారి విన్నప్పుడు ఎమోషనల్‌ అయినట్టు తెలిపారు షారుఖ్‌ ఖాన్‌. ఆయన నటించిన డంకీ ఈ నెల 21న విడుదల కానుంది. నికలె ది కబీ పాట తన తల్లిదండ్రులను, స్నేహితులను గుర్తుచేసిందని, ఢిల్లీలో తాను గడిపిన రోజులు కళ్ల ముందు మెదిలాయని అన్నారు షారుఖ్‌.

09.keerthy suresh
సినిమా హిట్‌ అయిందనో, ఫ్లాప్‌ అయిందనో…తాను తన ఆలోచనలను మార్చుకోనని అన్నారు నటి కీర్తీ సురేష్‌. తన దగ్గరకు వచ్చే కథలు, పాత్రలు తన ఊహకు అందని రీతిలో ఉంటాయని చెప్పారు. వాటిలో నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుందని అన్నారు. 2023లో మంచి హిట్స్ అందుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు.

3

5 Nayanthara – నయన్‌ బిర్యానీ
నయనతార ఇటీవల నటించిన సినిమా అన్నపూరణి. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో జైతో కలిసి కాలేజీ విద్యార్థులకు బిర్యానీ వడ్డించారు నయనతార. మాస్టర్‌ చెఫ్‌ కావాలనుకున్న అగ్రహారం అమ్మాయికి సంబంధించిన కథతో తెరకెక్కింది అన్నపూరణి. నయన్‌ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ గా రికార్డ్ అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.