స్టైల్ మార్చిన సీనియర్లు…స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?

Edited By:

Updated on: Jul 31, 2026 | 4:51 PM

టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు ఇప్పటికీ బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ వింటేజ్ కమర్షియల్ ఫార్ములాతో విజయాలు అందుకుంటుండగా, బాలకృష్ణ మాస్ యాక్షన్ చిత్రాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు నాగార్జున మాత్రం విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రయోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరి రాబోయే చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సీనియర్ హీరోల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలు కొత్త కథలతో వస్తుంటే… మన సీనియర్స్ మాత్రం వింటేజ్ స్టైల్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మ్యాజిక్ చేస్తున్నారు. ఇప్పుడున్న పోటీలో మన సీనియర్ హీరోల లైనప్స్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఎవరి బాక్సాఫీస్ స్ట్రాటజీ ఎలా వర్కవుట్ అవుతుంది? టాలీవుడ్ రేంజ్‌లో డిస్కషన్ పాయింట్‌గా మారిన ఆ టాపిక్ మీద మనం కూడా ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద సీనియర్ హీరోల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ జనరేషన్ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా కమర్షియల్ స్టైల్ కామెడీ, యాక్షన్, రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్‌తో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. 90స్, 2000 స్టైల్‌ కమర్షియల్ ఫార్ములానే ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొస్తూ మేజిక్ చేస్తున్నారు. వింటేజ్ వైబ్స్‌ను రిపీట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కమర్షియల్ ఫార్ములాను రిపీట్ చేసే విషయంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’తో తన పాత వింటేజ్ కామెడీ, యాక్షన్ ఫార్ములాను రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు.. అదే ఉత్సాహంతో మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. మరోవైపు వెంకటేష్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో సక్సెస్ కొట్టారు. చిరంజీవితో కలిసి గెస్ట్‌ రోల్‌లోనూ అదరగొట్టారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎవరితో సంబంధం లేకుండా తన మార్క్ మాస్ మూవీసే చేస్తున్నారు. ‘అఖండ’, ‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. గోపీచంద్ మలినేనితో మరోసారి తన పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ మూవీ సిద్ధం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా మాస్ ఎలివేషన్స్‌తో థియేటర్లను హోరెత్తిస్తూ తన బ్రాండ్ ఇమేజ్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. సీనియర్స్‌లో ఇద్దరు కమర్షియల్ ఫార్ములా, ఇంకొకరు మాస్ దారిలో వెళ్తుంటే.. కింగ్ నాగార్జున మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఈ నలుగురు స్టార్ హీరోల్లో నాగార్జున మాత్రమే ప్రయోగాలు చేస్తున్నారు. ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’ లాంటి యాక్షన్ ఫిల్మ్స్ చేసిన ఆయన.. ఆ తర్వాత ‘నా సామిరంగ’ అంటూ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. రీసెంట్‌గా కుబేరతో మరో డిఫరెంట్ జానర్‌ను టచ్ చేసిన నాగ్ వందో సినిమా విషయంలోనూ అదే రిస్క్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్

కర్నూలులో ఘరానా మోసం… తల్లికి వందనం సొమ్ము స్వాహా!

ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!

Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

Loading...
Unable to load recommendations.
Follow Us