విశ్వంభరకన్నా ముందే స్వయంభు.. ఇప్పుడిదే టాపిక్
తెలుగు సినీ పరిశ్రమలో రిలీజ్ డేట్ల చర్చ కొనసాగుతోంది. సంక్రాంతి మిస్ చేసుకున్న సినిమాలు సమ్మర్‌లో రావాల్సి ఉన్నా వాయిదాలు పడుతున్నాయి. పెద్ది నుండి మెగా అభిమానుల దృష్టి విశ్వంభరపైకి మళ్లింది. విశ్వంభర జూలై 10న, స్వయంభు మే 23న విడుదలయ్యే అవకాశాలున్నాయని తాజా వార్తలు. వాయిదాలు, కొత్త రిలీజ్ డేట్స్‌పై ఇండస్ట్రీలో భిన్న ప్రచారాలు జరుగుతున్నాయి.
రిలీజ్ డేట్ల గురించిన చర్చ ఇప్పట్లో వదిలేలా లేదు. ఒక సినిమా గురించి మాట్లాడటం కంప్లీట్ అయిందనుకుంటే, వెంటనే క్యూలో మరో మూవీ కనిపిస్తోంది. సంక్రాంతిని మిస్ చేసుకుని సమ్మర్‌లో అయినా కనిపిస్తాయనుకున్న ఆ సినిమాలేంటి? వాటి స్టేటస్‌లేంటి? ఒకసారి చూసేద్దామా… పెద్ది రిలీజ్ డేట్ మీద అఫిషియల్ నోట్ వస్తేగానీ, ఇదీ సంగతి అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సో, మెగాభిమానులు ఫోకస్ ని పెద్ది మీద నుంచి విశ్వంభరకి షిఫ్ట్ చేశారు. ఎప్పుడు? ఇంకెప్పుడు? అని ఆరా తీస్తున్నారు. జులై 10న విశ్వంభర రిలీజ్ అయ్యే ఛాన్సులు మెండుగా ఉన్నాయన్నది లేటెస్ట్ న్యూస్. విశ్వంభరకు సంబంధించి నాదీ పూచి అంటూ మెగాస్టార్ ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియోను షేర్ చేసుకుంటున్నారు అభిమానులు. జులైలో అయినా రిలీజ్ చేసేయండని మేకర్స్ తో చెబుతున్నారట. ఇటు.. ఈ నెల్లోనే రిలీజ్ కావాల్సిన స్వయంభు విషయంలోనూ ఇలాంటి న్యూసే వినిపిస్తోంది. ఈ నెల్లో రిలీజ్ కావాల్సిన స్వయంభు సినిమా వాయిదా పడిందన్నది వార్త. అయితే మే 23న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గ్రాండ్ గా అనౌన్స్ చేసి వాయిదా వేయడం ఓ పద్ధతైతే, సైలెంట్‌గా అనుకున్న తేదీని ప్రకటించడం ఇంకో పద్ధతి అవుతోంది ఇండస్ట్రీలో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్‌లో వైరల్ అవుతున్న బయోపిక్‌లు
ముందుకొచ్చిన ఆదిత్య.. సందీప్ ఆలోచిస్తారా ??