CM Thalapathy Vijay: సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా ??

Updated on: May 12, 2026 | 11:21 AM

దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు నెలకు రూ. 2,05,000 జీతం, అలవెన్సులతో కలిపి మొత్తం రూ. 2,85,000 లభిస్తుంది. ప్రభుత్వ నివాసం, బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, Z+ భద్రత, అధికారిక పర్యటనలకు ప్రయాణ ఖర్చులు వంటి అనేక ప్రయోజనాలుంటాయి. పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్, వైద్య సదుపాయాలు లభిస్తాయి.

దళపతి విజయ్ మే 10న.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా వెండితెరపై హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజా సేవ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచారు. అయితే, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నెలసరి జీతం ఎంత అందుకుంటారు..? ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా. తమిళనాడు ముఖ్యమంత్రికి నెలసరి వేతనంగా రూ. 2,05,000 లభిస్తుంది. అనేక రాష్ట్రాల సీఎంల వేతనం కంటే ఇది చాలా తక్కువ. వివిధ అలవెన్సులతో కలిపి సీఎం విజయ్‌కు మొత్తం నెలసరి వేతనం రూ. 2,85,000 అందుతుంది. విజయ్‌కు లభించే ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇతర అలవెన్సులతో పాటు, ఎమ్మెల్యే హోదాలో ప్రత్యేక నియోజకవర్గ అలవెన్సు CVAను పొందుతారు. ఈ CVAలో విలాస భత్యం , రోజువారీ భత్యం ఉంటాయి. వీటిని అధికారిక పనులు , సమావేశాలకు సంబంధించిన ఖర్చుల కోసం చెల్లిస్తారు. అంతేకాదు తమిళనాడు ముఖ్యమంత్రిగా, విజయ్‌కు చెన్నైలో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ వసతి గృహాన్ని కేటాయిస్తారు. ఇందులో క్యాంప్ ఆఫీస్, సిబ్బందికి పూర్తి సదుపాయాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఖర్చుతో సీఎం విజయ్‌కు ఒక బుల్లెట్‌ప్రూఫ్ SUV, వాహనాలతో కూడిన పూర్తి కాన్వాయ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, రాష్ట్ర లేదా కేంద్ర అధికారిక పర్యటనల సమయంలో, విమాన, రైలు లేదా రోడ్డు మార్గ ప్రయాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర అతిథిగా వసతి కూడా ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రిగా, సీఎం విజయ్‌కు 30 మందికి పైగా ఉన్నత శ్రేణి కమాండోలు, పోలీసు సిబ్బందితో కూడిన జెడ్+ కేటగిరీ భద్రత కల్పించబడుతుం. వీరు ఇరవై నాలుగు గంటలూ విధుల్లో ఉంటారు. పదవీ విరమణ తర్వాత మాజీ ముఖ్యమంత్రికి లభించే ప్రయోజనాలలో పెన్షన్, వైద్య సౌకర్యాలు, ఉచిత రైలు ప్రయాణం , పరిమిత సిబ్బందితో కార్యాలయ నిర్వహణ వంటివి ఉంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Vijay: అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు

RK Roja: నా చిన్నారి అన్షు.. ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగింది !! రోజా ఎమోషనల్..

Ashu Reddy: నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి

Bharat Kanth: అతివేగం.. హీరో అవ్వాల్సిన వాడిని చిదిమేసింది

Loading...
Unable to load recommendations.
Follow Us