రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

Updated on: Mar 03, 2026 | 12:01 PM

విరోష్ రిసెప్షన్ కు ఆహ్వానం ఉన్నవాళ్ళే రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అభిమానులంతా వచ్చి ఇబ్బందులు పడొద్దని చెప్తున్నారు. అటు కొత్త జంట కూడా ఇదే విజ్ఞప్తి చేస్తోంది. ఈ నెల 4వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మికల రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. కొందరిని స్వయంగా విరోష్ జంట ఆహ్వానించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను స్వయంగా కొత్త జంట ఆహ్వానించారు. హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు హాజరు కావాలని కోరారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణలోని మంత్రులు, ముఖ్య నేతలను ఆహ్వానించారు.

ఇండియాలోనే క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్ గా విరోష్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పెళ్లి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఈనెల 4వ తేదీన సాయంత్రం విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు ఈ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు. మరోవైపు కొత్త జంట ఆలయాలను సందర్శిస్తోంది. దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటోంది. ఇక నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న విజయ్ స్వగ్రామానికి వెళ్ళనుంది నూతన జంట. అక్కడ సొంత ఊర్లో, సొంత గృహంలో సత్యనారాయణ వ్రతం, పూజల తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానుంది. ఆ తర్వాత రిసెప్షన్ లో పాల్గొంటారు.

 

Follow Us