TVK Vijay: అప్పుడు NTR, ఇప్పుడు విజయ్! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..
తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ సాధించిన అఖండ విజయంపై నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎక్స్ ద్వారా పోస్ట్ చేస్తూ, విజయ్ ప్రస్థానాన్ని ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి మహానాయకులతో పోల్చారు. కేవలం 27 నెలల్లోనే టీవీకే పార్టీ విజయం సాధించడం అద్భుతమన్నారు. ప్రజా సేవలో విజయ్ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
తమిళరాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్‌కు టీడీపీ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీర భ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే ప్రపంచ సినీ రాజకీయ చరిత్రలో మరో ఒక అద్భుతమైన పునరావృతమని ఆయన అన్నారు. వెండితెర నుండి జనం గుండెల్లోకి ప్రవేశించి, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన రోనాల్డ్ రీగన్ గారు ఒక చరిత్ర అయితే. దక్షిణ భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన భారతరత్న ఎమ్.జి.ఆర్ గారు, పురట్చి తలైవి జయలలిత గారు మరో అద్భుతమన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారాన్ని చేపట్టి పెదపాలిట పెన్నిధిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మికసోదరలకు దన్నుగా, ఆడపడుచులకు అన్నగా నిలబడిన మన అన్నగారు, నాన్న నందమూరి తారక రామారావు ఒక యుగపురుషుడన్నారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ స్థాపించి కేవలం 27 నెలల కాలంలోనే అఖండ విజయాన్ని అందుకుని, పీఠాన్ని అధిరోహించబోతున్న సినీ రాజకీయ ధురంధరుడు దళపతి విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు అని రాసుకొచ్చారు. చరిత్రను తిరగరాస్తూ విజయ్ సాధించిన ఈ విజయం అద్వితీయమని.. అతను మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, ప్రజా సేవలో సుదీర్ఘకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోహినూర్ భారత్‌దే… తిరిగివ్వమని అడుగుతా
పాపం! కృష్ణరాజు సొంత కొడుకు.. ఎలా చనియాడో తెలుసా
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్
విమానం ఎక్కేముందు ప్రతీసారీ.. వారికి నోట్ పంపుతానన్న ఆమిర్
Trisha: అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
