CM Vijay: అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు

Updated on: May 12, 2026 | 11:20 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉదయనిధి స్టాలిన్, దళపతి విజయ్‌ల పాత ఫోటో తమిళనాడు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు అద్దం పడుతోంది. ఒకప్పుడు సినీ రంగంలో మంచి స్నేహితులైన వీరిద్దరూ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఎంజీఆర్-కరుణానిధిల స్నేహం-వైరం లాగే, ఈ యువ నాయకుల ప్రస్థానం రాబోయే 20 ఏళ్లు తమిళ రాజకీయాలను ప్రభావితం చేయనుంది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటో… దాదాపు 15 ఏళ్ల క్రితం తీసింది. ఈ పాత ఫోటో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు అద్దం పడుతోంది. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు యువకులు మరెవరో కాదు.. ఒకరు DMK పార్టీ నాయకుడు ఉదయనిధి స్టాలిన్, మరొకరు కోలీవుడ్ దళపతి, TVK అధినేత, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్. పైన కనిపిస్తున్న ఫోటోలో విజయ్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి నవ్వుతూ కనిపిస్తున్నారు. ఒకప్పుడు విజయ్‌కి , ఉదయనిధితో మంచి అనుబంధం ఉండేది. ఉదయనిధి తన సినీ నిర్మాణ సంస్థ ‘రెడ్ జెయింట్ మూవీస్’ ద్వారా విజయ్ నటించిన ‘కురువి’ వంటి చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఒకప్పుడు సినిమా వేదికలపై కలిసి కనిపించిన ఈ ఇద్దరు యువ నేతలు, ఇప్పుడు రాజకీయ రణరంగంలో ముఖాముఖి.. అధికార, ప్రతిపక్ష నేతలుగా మారారు. మరోవైపు, వెండితెరపై దళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్, ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీని సంపాదించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం విజయ్, ఉదయనిధి స్టాలిన్ త్రోబ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ గా మారగా.. ఒక నెటిజన్ స్పందిస్తూ.. రాబోయే 20 సంవత్సరాలు వారి చుట్టే తిరుగుతాయి.. యువ నాయకులు బాధ్యతలు స్వీకరించడం చూడటం సంతోషంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. గతంలో ఎం.జి. రామచంద్రన్ , కరుణానిధి మధ్య కూడా ఇలాంటి స్నేహం, ఆ తర్వాత రాజకీయ వైరం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో విజయ్ , ఉదయనిధి స్టాలిన్ తలపడ్డారు. “అప్పుడు భుజం భుజం కలిపి నవ్విన వారు, ఇప్పుడు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకున్నారు” అని నెటిజన్లు ఈ వైరల్ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RK Roja: నా చిన్నారి అన్షు.. ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగింది !! రోజా ఎమోషనల్..

Ashu Reddy: నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి

Bharat Kanth: అతివేగం.. హీరో అవ్వాల్సిన వాడిని చిదిమేసింది

Published on: May 12, 2026 11:19 AM
Follow Us