తెలుగులో అవకాశాలు నిల్.. కానీ తమిళంలో మాత్రం హౌజ్ ఫుల్

Edited By:

Updated on: Jun 27, 2026 | 5:59 PM

టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిన హీరోయిన్లకు కోలీవుడ్ ఆశాకిరణంగా మారుతోంది. రాశీ ఖన్నా, కృతి శెట్టి, శ్రీలీల, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి భామలకు తమిళ చిత్రసీమ వరుస అవకాశాలు ఇస్తూ కెరీర్‌కు కొత్త ఊపు తీసుకొస్తోంది. తెలుగులో ఫ్లాపులు, ఆఫర్ల కొరత ఎదురైనా తమిళంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటూ ఈ హీరోయిన్లు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

తెలుగులో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న ముద్దుగుమ్మలందరికీ తమిళ ఇండస్ట్రీ ఆపన్న హస్తం అందిస్తుంది. మీకు మేమున్నాం అంటూ ఆఫర్స్ ఇస్తున్నారు. ఫ్లాపుల్లో ఉన్న బ్యూటీస్.. ఆఫర్స్ లేని హీరోయిన్స్‌కు అదిరిపోయే అవకాశాలిస్తూ కెరీర్‌కు ఊపిరి పోస్తున్నారు. మరి అలా తెలుగులో ఛాన్సుల్లేక తమిళంలో బిజీగా ఉన్న భామలెవరో తెలుసా..? రాశీ ఖన్నాకి తెలుగులో విజయాల్లేక చాలా రోజులైపోయింది. వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడట్లేదు.. రీసెంట్‌గా ఈమె నటించిన తెలుసు కదా, ఉస్తాద్ రెండూ ఫ్లాపులే. దాంతో టాలీవుడ్‌లో రాశీకి ఆఫర్స్ రావట్లేదు. దాంతో ఈమె చూపులు తమిళ, హిందీ ఇండస్ట్రీపై పడ్డాయి. లక్కీగా అక్కడ్నుంచి ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.. తాజాగా రజినీకాంత్ సినిమాలోనూ రాశీకి బంపర్ ఆఫర్ వచ్చింది. రజినీ సినిమాతో పాటు తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నారు రాశీ. ఇక హిందీలో సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగులో ఆఫర్స్ లేని టైమ్‌లోనూ కృతి శెట్టిని నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు తమిళ తంబీలు. ప్రస్తుతం అక్కడ శంకర్ తనయుడు అర్జిత్ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో కృతి నటిస్తున్నారు. తెలుగులో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. శ్రీలీల విషయంలోనూ ఇదే మ్యాజిక్ జరుగుతుంది. తెలుగులో ఈమె బిజీగా ఉన్నన్నాళ్లూ తమిళం నుంచి పిలుపు రాలేదు. ఇక్కడ ఆఫర్స్ ఆగిపోయాక.. అక్కడ్నుంచి వెల్లువగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ ‘ఓం’ సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లాంటి వాళ్లకు తెలుగులో ఛాన్సుల్లేకపోయినా తమిళంలో బాగానే ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలా? త్వరపడండి.. జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్‌!

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, పిడుగులు

Rashmika Mandanna: ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్

రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!

Follow Us