SSMB29: సగం సగం సర్‌ప్రైజ్‌.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

Updated on: Aug 10, 2025 | 4:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ బిగ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై ఇప్పిటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. SSMB29 సినిమా నుంచి మహేష్ బాబు ఫేస్ కనిపించకుండా… జక్కన్న ఓ పోస్టర్‌ను వదిలాడు. అంతేకాదు మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఏమాత్రం ఫీలవకుండా.. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 2025లో షేర్ చేయనున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చాడు జక్కన్న. ఇక జక్కన్న రిలీజ్ చేసిన పోస్టర్‌లో… మహేష్ బాబు మెడలో త్రిశూలం నందితో కూడిన ఒక లాకెట్ ధరించి కనిపిస్తున్నారు. ఈ లాకెట్ తోపాటు మెడపై నుంచి రక్తం కారుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పోస్టర్ మొత్తం రివీల్ చేయకపోయినా కేవలం ఛాతీ పిక్ చూపించిన సరే బెస్ట్ ట్రీట్ అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Krithi Shetty: అప్పుడు చలించకుండా.. ఇప్పుడు అందాలు ఆరబోసి ఏం లాభం?

ఓ కుటుంబాన్నిరోడ్డున పడేసిన పాము.. ఏం జరిగిందో తెలిస్తే

పెట్రోలు బంకు కొంప ముంచిన హెల్మెట్‌ రూల్

జేమ్స్ కామెరూన్ కొత్త సినిమా.. టైటానిక్ తరహాలో మరో రియల్ స్టోరీ

ఏడేళ్లలో 42 సార్లు ‘నో’ చెప్పింది 43వ సారి మాత్రం..