Dhoom 4: కిర్కాక్ న్యూస్.! షారుక్ ఖాన్, రామ్ చరణ్ హీరోలుగా ధూమ్ 4.. క్లారిటీ.
షారుక్ ఖాన్, రామ్ చరణ్.. ఒకరు బాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయితే మరొకరు టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్. ఇద్దరు హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా బోలెడు అభిమానులు ఉన్నారు. వీరి సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. అలాంటి స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. ఫ్యాన్స్‌కు పండగే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ నిజయమ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షారుక్, రామ్ చరణ్‌లు ఒకే సినిమలో కలిసి నటించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది..
షారుక్ ఖాన్, రామ్ చరణ్.. ఒకరు బాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయితే మరొకరు టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్. ఇద్దరు హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా బోలెడు అభిమానులు ఉన్నారు. వీరి సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. అలాంటి స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే.. ఫ్యాన్స్‌కు పండగే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ నిజయమ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షారుక్, రామ్ చరణ్‌లు ఒకే సినిమలో కలిసి నటించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది. అది కూడా క్రేజీ ఫ్రాంచైజీ ధూమ్ సిరీస్‌లో.. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే ధూమ్ ఫ్రాంఛైజీలో మూడు సినిమాలను రూపొందించగా అన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు షారుక్ ఖాన్, రామ్ చరణ్‌లతో ధూమ్ 4 ను తెరకెక్కించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ధూమ్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు విలన్లుగా నటించారు. అయితే ఈ మూడు సినిమాల్లో అభిషేక్ బచ్చన్ పోలీస్ పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ధూమ్ 4 కోసం మాత్రం హీరోతో పాటు పోలీస్ పాత్రను కూడా మార్చనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దొంగగా షారుక్ ఖాన్, పోలీస్ రోల్‌లో రామ్ చరణ్ యాక్ట్ చేస్తే బాగుంటుందని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.
‘ధూమ్’ సిరీస్‌లో కథానాయకుడికి నెగెటివ్ షేడ్ ఉంటుంది. ఇప్పటికే ‘డాన్’ సినిమాలో కూడా అలాంటి పాత్రనే పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు షారుక్. ‘ధూమ్ 4’లో ప్రధాన పాత్ర పోషించాలన్నది అభిమానుల డిమాండ్. ఈ సినిమాలో షారూఖ్, రామ్ చరణ్ నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి ఏదీ ఫైనల్ కాలేదని అంటున్నారు. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.మరి షారుక్, రామ్ చరణ్‌లతో ధూమ్ 4 మూవీ మేకింగ్‌పై యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.