60 ప్లస్ హీరోలకు సీనియర్ హీరోయిన్లే బెస్ట్ ఛాయిస్.. టాలీవుడ్‌లో మారుతున్న ట్రెండ్
టాలీవుడ్‌లో 60 ప్లస్ హీరోలకు జోడీగా సీనియర్ హీరోయిన్లకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. బాలకృష్ణ-కాజల్, చిరంజీవి-త్రిష, వెంకటేష్-కీర్తి సురేష్, నాగార్జున-టబు వంటి జోడీలు తెరపై కనిపించనున్నాయి. వయసుకు తగ్గ పాత్రలు, సహజమైన కెమిస్ట్రీ కోసం దర్శకులు సీనియర్ హీరోయిన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఒకప్పుడు స్టార్‌డమ్‌ను ఆస్వాదించిన నటీమణులకు మరోసారి మంచి అవకాశాలు దక్కుతున్నాయి.
60 ప్లస్ వచ్చాక హీరోలకు జోడీ దొరకడం కాస్త కష్టమే. ఒకవేళ కుర్ర హీరోయిన్లతో జోడీ కడదామంటే.. స్క్రీన్ మీద బెడిసికొడుతుందని భయం. అందుకే దర్శకులు కూడా తెలివిగా సీనియర్ హీరోయిన్ల వైపే అడుగులేస్తున్నారు. స్క్రీన్ మీద చూడ్డానికి అందంగా ఉండే జోడీనే వెతికి పట్టుకుంటున్నారు. తాజాగా మన హీరోలందరికీ అలాంటి జోడీనే వెతుకుతున్నారు మేకర్స్. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దామా..? సీనియర్ హీరోయిన్లకు లైఫ్ ఇస్తున్నారు 60 ప్లస్ హీరోలు.. అలాగే ఆ హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా మారుతున్నారు సీనియర్ హీరోయిన్లు. జోడీలు రిపీట్ అయినా.. స్క్రీన్ మీద కెమిస్ట్రీ అదిరిపోతుంది. అందుకే సీనియర్ల వైపు మళ్లీ మళ్లీ అడుగేస్తున్నారు. తాజాగా బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాలో కాజల్ హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యారు. భగవంత్ కేసరితో బాలయ్యతో నటించారు ఈ బ్యూటీ. గత పదేళ్లలో అంజలి, సోనాల్ చౌహాన్, ప్రగ్యాజైస్వల్, నయనతార లాంటి హీరోయిన్లతో రెండు మూడుసార్లు నటించారు బాలయ్య. అందుకే ఈసారి కాజల్ వైపు అడుగేసారు గోపీచంద్. భగవంత్ కేసరిలో ఈ ఇద్దరూ నటించినా.. జంటగా కాదు.. జస్ట్ కలిసి నటించారంతే. ఇక చిరంజీవి విశ్వంభరలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు.. అలాగే బాబీ సినిమాలో ప్రియమణి పేరు బలంగా వినిపిస్తుంది. కొన్నేళ్లుగా సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు ఉన్నా కూడా వయసుకు తగ్గ పాత్రలే చేస్తున్నారు. మన శంకరవరప్రసాద్ గారులో ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన చిరు.. నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక అఖండ 2లో బాలయ్యకు హీరోయినే ఉండదు. తాజాగా అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్‌తో కీర్తి సురేష్ నటిస్తున్నారు. నాగార్జున సైతం కింగ్ 100వ సినిమాలో చాలా కాలం తర్వాత టబుతో కలిసి నటిస్తున్నారు. మన సీనియర్ హీరోలను ఎవరిని తీసుకున్నా కూడా కథలో భాగంగానే హీరోయిన్లతో జోడీ కడుతున్నారు కానీ ఒకప్పట్లా పాటల కోసం అయితే కాదు. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ కెరీర్‌కు మన హీరోలు తెలియకుండానే చాలా పెద్ద సాయం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?
OTT గైడ్! వావ్.. 16 పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి
Samantha: సమంత పిల్లి పేరు వెనకాల.. ఓ జ్ఙాపకం.. ఓ కష్టం.. ఓ కన్నీటి కథ ఉంది తెలుసా?
Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!