సమంత దీపావళి సెలబ్రేషన్స్‌రాజ్‌ నిడిమోరు కుటుంబంతో

Updated on: Oct 21, 2025 | 8:06 PM

నటి సమంత, బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా రాజ్‌తో కలిసి సమంత దీపావళిని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ మధ్య సమంత, రాజ్ నిడిమోరు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు దీవాళీ సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ అవ్వడంతో సామ్, రాజ్ రిలేషన్ పై అభిమానుల అనుమానాలకు మరింత బలం చేకూరింది.

బాణసంచా కాలుస్తోన్న ఫొటోలను షేర్‌ చేసిన సామ్‌.. ‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ అని క్యాప్షన్‌ పెట్టారు. తరచూ వీరిద్దరూ కలిసి కనిపిస్తుండడంతో ఆ ఫొటోలు నెటిజన్‌లను ఆకర్షిస్తున్నాయి. రాజ్‌-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’లో సమంత నటించారు. ఆ సమయంలోనే రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్నో రోజులుగా ఆమె అభిమానులు ఎదురుచూస్తోన్న ‘మా ఇంటి బంగారం’ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి నందినిరెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనితో పాటు ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ వెబ్ సీరీస్‌లో సమంత ప్రస్తుతం నటిస్తున్నారు. ఇటీవలే నిర్మాతగా మారిన సమంత శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగాళాఖాతంలో అల్పపీడనం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

అద్భుతం.. శ్రీకృష్ణుడి విగ్రహానికి చూపులేని లేగ ప్రదక్షిణలు

Dil Raju: బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న దిల్ రాజు

Sudheer Babu: సుధీర్ బాబు కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీ

ఫైనల్ రిపోర్ట్‌.. దర్శన్‌కు బిగ్ ఝలక్