అబ్బో.. తేజ్‌ భార్య బ్యాగ్రౌండ్.. చాలా పెద్దదే.. ఆస్తులు కోట్లలోనే..

Updated on: Nov 11, 2026 | 2:54 PM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె విద్యార్హతలు, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా వృత్తి, కుటుంబ నేపథ్యంపై ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెగా వార్తల్లో నిలిచిన కిరణ్మయి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న కిరణ్మయిని ఆయన వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ 5న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె కుటుంబ నేపథ్యం, చదువు, వృత్తి, ఆస్తిపాస్తుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. కిరణ్మయి కుటుంబ నేపథ్యానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త అని, దేశవ్యాప్తంగా వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోని కొంతమంది నిర్మాతలకు ఆయన ఫైనాన్షియర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపార రంగంలో ఆయనకు మంచి గుర్తింపు ఉందని, భారీ ఆస్తులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు పెద్దగా వివరాలు బయటకు రాలేదు. అయితే ఆమె ఉన్నత విద్యను అభ్యసించారని, ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారని తెలుస్తుంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నప్పటికీ ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్మయి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని.. తారక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు

‘శ్రీరాముడిగా’ సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే ‘రామాయణ’ సినిమా ప్రకటన.. కానీ…

పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారంపై.. వైసీపీ కీలక ప్రకటనలు..

సినిమా మార్కెటింగ్ పై.. హీరోల, ప్రొడ్యూసర్ల తీరుపై.. RGV మార్క్‌ విశ్లేషణ!

Janhvi Kapoor: ముక్కు సర్జరీ తర్వాతే.. అమ్మ నన్ను హీరోయిన్‌గా నమ్మింది!

Loading...
Unable to load recommendations.
Follow Us