చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

Updated on: Mar 30, 2026 | 6:26 PM

నటి షబా ఆజాద్ 'సైక్లోస్పోరియాసిస్'తో ఆసుపత్రి పాలయ్యారు. తన శరీరంలోకి పరాన్నజీవి ప్రవేశించి, నడవలేని స్థితికి చేరుకుందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. 14 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన ఆమె, పచ్చి కూరగాయల ద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరించారు. బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని సూచిస్తూ, ఈ కష్టకాలంలో హృతిక్ రోషన్ అండగా ఉన్నారని తెలిపారు.

షబా ఆజాద్‌! నటిగా.. సింగర్‌గా.. బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఈమె హృతిక్ రోషన్ ప్రియురాలిగానే ఎక్కువ మందికి సుపరితమైంది. హృతిక్‌తో కలివిడిగా తిరుగుతూ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటుంది. అలాంటి ఈమె ఉన్నట్టుండి తాను ఆసుపత్రి బెడ్‌ పై ఉన్న ఫోటోను షేర్ చేసింది. దాంతో పాటే తన శరీరంలోకి ఓ పరాన్న జీవి ప్రవేశించిందని… దాని వల్ల తాను నడవలనిక స్థితికి చేరుకున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ‘సైక్లోస్పోరా కయోటానెన్సిస్’ అనే పారాసైట్ వల్ల కలిగే వ్యాధిని ‘సైక్లోస్పోరియాసిస్’ అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. షబా అజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులుగా తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని చెప్పుకొచ్చింది. రోజుకు రెండుసార్లు జిమ్‌లో వర్కౌట్లు చేసే తాను.. ఇప్పుడు కనీసం టూత్ పిక్ కూడా ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్నిబట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది. మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందులోనూ పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని చెప్పుకొచ్చింది. ఈ కష్టకాలంలో తన ప్రియుడు హృతిక్ రోషన్ తనకు కొండంత అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. తన మూడ్ ఎంత బాగోలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని, ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోని షబా షేర్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Follow Us