Loading video

మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!

|

Mar 25, 2025 | 6:19 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసిన ఆయన ఇప్పుడు కేవలం ప్రజాసేవకే పరిమితమయ్యారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బాటలోనే వారి పిల్లలు పయనిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో తండ్రికి తగ్గ బిడ్డలు అనిపించుకుంటున్నారు.

తాజాగా పవన్ కూతురు ఆద్య చేసిన ఒక మంచి పని అందరి మన్ననలు అందుకుంటోంది. ఇక రేణూ దేశాయ్ అయితే కూతురి గొప్ప తనాన్ని చూసి తెగ మురిసిపోయింది. తన సోషల్ మీడియాలో ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆద్య తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలంటే పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా ఉంటాయి. కేక్ కటింగ్, పార్టీలు, విందులు, వినోదాలు, ఫ్రెండ్స్.. ఇలా తమకు నచ్చిన రీతిలో పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆద్య మాత్రం సింపుల్ గా తన పుట్టిన రోజును జరుపుకొంది. దీనికి సంబంధించి రేణూ దేశాయ్ కు ముందే చెప్పిందట. బర్త్ డే కదా అని హడావిడి, హంగామా ఏమీ వద్దని, చాలా సింపుల్‌గా బర్త్ డేను సెలెబ్రేట్ చేయమని రేణూను కోరిందట ఆద్య. వాటికి ఖర్చు పెట్టే డబ్బుల్ని ఎన్జీవోకి వాడమని చెప్పిందట. తద్వారా ఎన్నో మూగ జీవాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సలహా ఇచ్చిందట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!

గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

పనస తొనలు ఆరోగ్యమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

రష్మికతోనే కాదు.. ఆమెకు పుట్టబోయే కూతురితో కూడా నటిస్తా..