‘ఊరు వాడ’ కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?

Updated on: Jul 16, 2026 | 12:23 PM

రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఊరు వాడ కార్యక్రమం ఈ నెల జూలై 18న తిరుపతిలో జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో, అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి నేపథ్యంలో, దీనికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు నల్లూరి సాయి రూప్, ఇటీవల హైదరాబాద్‌లో మాజీ ఐఏఎస్ అధికారి మరియు పబ్లిక్ పాలసీ అడ్వైజర్ శ్రీ జయప్రకాశ్ నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఊరు వాడ కార్యక్రమ ప్రణాళికలు, స్పష్టమైన రోడ్ మ్యాప్, మరియు ప్రధాన ఉద్దేశ్యాలకు సంబంధించి జయప్రకాశ్ నారాయణతో సాయి రూప్ చర్చించారు. సమాజం పట్ల, ప్రజాసేవ పట్ల జయప్రకాశ్ నారాయణకున్న విస్తృతమైన అవగాహన రానున్న ఊరు వాడ కార్యక్రమానికి ఎంతో తోడ్పడుతుందని తాము విశ్వసిస్తున్నట్లు సాయి రూప్ తెలిపారు. ఈ మధ్యకాలంలో కార్యక్రమంపై వస్తున్న ఊహాగానాలకు, తప్పుడు ప్రచారానికి పూర్తి స్పష్టత ఇచ్చేందుకు త్వరలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్‌లో కార్యక్రమం యొక్క లక్ష్యాలు, అమలు తీరుతెన్నులు, మరియు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. జై ఎన్టీఆర్ అంటూ సాయి రూప్ తన ప్రకటనను ముగించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us