రామాయణ ట్రైలర్ అంతా ఓకే.. ఆ ఒక్కటి తప్ప!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ విడుదలైంది. టీజర్ విమర్శలను సరిదిద్దుకుని, ట్రైలర్‌ను అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి ఆకట్టుకోగా, రావణుడిగా యష్ డామినేట్ చేశారు. అయితే, కథానాయకుడు హనుమాన్ ఒక్క షాట్‌లో కూడా కనిపించకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది.
భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ విడుదలైంది. టీజర్‌కు వచ్చిన నెగటివ్ టాక్‌ను సీరియస్‌గా తీసుకున్న మేకర్స్, ఇప్పుడు ట్రైలర్‌ను ఒక నెక్స్ట్ లెవల్ విజువల్ వండర్‌గా మలిచారు. ట్రైలర్ ఆద్యంతం అద్భుతమైన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే, ఈ ట్రైలర్‌ను తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో డామినేట్ చేసింది మాత్రం రావణుడే. ఈ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న యష్ తన రాజసంతో ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచారు.ఇంత అద్భుతంగా ఉన్న ట్రైలర్‌లో ప్రేక్షకులను కొంచెం నిరాశపరిచిన ఒకే ఒక్క లోటు హనుమంతుడు కనిపించకపోవడం. రామాయణం కథ అంత దూరం చూపించినా, ఒక్క షాట్‌లో కూడా హనుమాన్ లేకపోవడం ఆశ్చర్యమే. సన్నీ డియోల్ ఈ పాత్రను పోషిస్తున్నారు. దివాళీకి ఈ సినిమా విడుదల కాబోతోంది. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం :
