Ramayana:13 రోజుల ముందే రామాయణ బుకింగ్స్.. అదిరిన ప్లానింగ్స్

Edited By:

Updated on: Oct 24, 2026 | 6:18 PM

రణ్‌ టైమ్‌ కంటే 13 రోజుల ముందే ‘రామాయణ’ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం కావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్న దిల్‌ రాజు, టికెట్‌ ధరలను పెంచకుండా సాధారణ రేట్లకే అందుబాటులో ఉంచినట్లు సమాచారం. ఏపీ మల్టీప్లెక్స్‌లలో రూ.177, నైజాంలో గరిష్టంగా రూ.295 ధరలతో టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించి థియేటర్లకు వచ్చే వారి సంఖ్యను పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది.

రేపు రిలీజ్ అనగా కానీ బుకింగ్స్ ఓపెన్ చేయని ఈ రోజుల్లో.. ఏకంగా 13 రోజుల ముందే టికెట్స్ ఇచ్చేసి రామాయణ సినిమా కొత్త రికార్డ్ సృష్టించిందా..? భారీ సినిమాకు దిల్ రాజు రేట్లు పెంచకుండా వేసిన మాస్టర్ స్కెచ్ హాట్ టాపిక్ అయ్యిందా..? ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? రామాయణ ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా..? తెలుగు రాష్ట్రాల్లో రామాయణ హక్కులు తీసుకున్న దిల్ రాజు.. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో బుకింగ్స్ ఓపెన్ చేసి అందరికీ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. రిలీజ్‌కు ఇంత ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వడం ఈ మధ్య కాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు జరగలేదు. కేవలం ఈ కారణంతోనే రామాయణ సినిమా అప్పుడే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మామూలుగా ప్యాన్ ఇండియన్ సినిమాలు వచ్చినపుడు రేట్లు పెరగడం కూడా కామన్ అయిపోయింది.. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ రామాయణకు ఎలాంటి హైక్స్ కూడా అడగకుండా రెగ్యులర్ రేట్లకే ఈ సినిమాను తెస్తూ.. ఆడియన్స్‌కు సగం భారం తగ్గించారు దిల్ రాజు. ఏపీ మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలతో, నైజాంలో గరిష్టంగా 295 రూపాయలకు టికెట్స్ అందుబాటులో ఉంచడం విశేషం. ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద సినిమాలకు హైక్స్ నష్టం చేసాయే తప్ప లాభమైతే కాదు. అందుకే రామాయణకు ఫుట్‌ఫాల్స్ పెంచేలా మేకర్స్ ఈ స్మార్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఒకవేళ హైక్స్ ఉంటే 50 నుంచి 100 రూపాయల అదనపు భారం పడేది. ఈ నిర్ణయంతో రామాయణ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ సాలిడ్‌గా దక్కడం ఖాయం. నవంబర్ 5న విడుదల కానుంది ఈ సినిమా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?

గన్‌ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?

దంపతుల రీల్స్‌ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా

ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!

Loading...
Unable to load recommendations.
Follow Us