మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఉపాసన ఏకంగా 150 వృద్ధాశ్రమాలకు అండగా..!
అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ వైస్ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మెగా కోడలు ఉపాసన. ఇందులో భాగంగానే సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ వీటిపై తరచూ పోస్టులు పెడుతుంటారు.
తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ఉపాసన. ఉపాసన ఈసారి ఏకంగా 150 వృద్ధాశ్రమాలను దత్తత తీసుకున్నారుసేవలో తమకు ఎవరూ సాటి రారని మరోసారి నిరూపించుకున్నారు. ఇక నుంచి ఈ అనాథాశ్రమాల బాధ్యత మొత్తం ఉపాసనే చూసుకోనున్నారు. ముఖ్యంగా వృద్ధులకు వైద్య సదుపాయాలు, పోషకాహారం, ఎమోషనల్ సపోర్ట్ కల్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మెగా కోడలు. అయితే దీనిపై ఎక్కడా గానీ.. అధికారిక ప్రకటన ఇవ్వలేదు ఉపాసన. కానీ ఇందుకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు మెగా కోడలి గొప్ప మనసుపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెను మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన విజయ్ దేవరకొండ
ఎన్ని AIలు వచ్చినా మనిషి మేధస్సుకు ఢోకా లేదు
చిన్నోడనుకునేరు.. మనోడు మహా రసికుడు..
గుడ్డు వారికి పాయిజన్‌తో సమానం!
సొంత మనవళ్లే కాడేద్దులు.. హృదయాలను కుదిపేస్తున్న రైతన్న కష్టాలు